దుబ్బాకలో కాంగ్రెస్‌ గెలుపు కేసీఆర్‌కు చెంపపెట్టు | Dubbaka By Election Ponnala Lakshmaiah Slams KCR | Sakshi
Sakshi News home page

దేశంలో పెద్ద అవినీతి పరుడు కేసీఆర్‌: పొన్నాల

Oct 7 2020 3:03 PM | Updated on Oct 7 2020 3:17 PM

Dubbaka By Election Ponnala Lakshmaiah Slams KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెంప పెట్టు కావాలన్నారు కాంగ్రెస్‌ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..12 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్న రామలింగారెడ్డి దుబ్బాకలో ఎలాంటి అబివృద్ధి చేయలేదు. భారతదేశం వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసే స్తాయికి తీసుకువెల్లింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. చేతగాని మాటలు చేప్పి కేసీఆర్‌ అదికారంలోకి వచ్చాడు. 30 శాతం మంది కౌలు రైతులకు ఎలాంటి లాభం లేదు. రైతులకు రుణమాఫీ జరగలేదు. కేసీఆర్‌ పాలనలో రైతులకు పంటనష్టం డబ్బులు రాలేదు. నియంత్రిత సాగు చేయించి మొక్కజొన్న, పత్తి రైతులకు అన్యాయం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజలను కలవడు వారి బాగోగులు చూడడు. దేశంలో పెద్ద అవినీతి పరుడు కేసీఆర్‌. మిషన్ భగీరథ.. సాగునీటి ప్రాజెక్టుల అవినీతిలో జైలు పాలు కాకతప్పదు’ అన్నారు. (రేపటి నుంచి దుబ్బాకలోనే ఉంటా : ఉత్తమ్‌)

Advertisement
 
Advertisement
Advertisement