ధర్మవరంలో పరిటాల, సూరి వర్గీయుల మధ్య బయటపడ్డ విబేధాలు | Dharmavaram: Clash Between TDP Leader Paritala Sriram And Varadapuram Suri | Sakshi
Sakshi News home page

సూరీ V/s పరిటాల.. ధర్మవరంలో తీవ్ర స్థాయికి చేరిన టీడీపీ నేతల విబేధాలు

Mar 4 2024 2:36 PM | Updated on Mar 4 2024 3:20 PM

Dharmavaram: Clash Between TDP Leader Paritala Sriram And Varadapuram Suri - Sakshi

సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రతిపక్ష టీడీపీలో వర్గపోరు రచ్చకెక్కింది. ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేతల విబేధాలు తీవ్ర స్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ మధ్య మరోసారి విబేధాలు బయటపడ్డాయి.

తాజాగా బత్తలపల్లిలో వరదాపురం సూరి వర్గీయుల వాహనాలను పరిటాల అనుచరులు ధ్వంసం చేశారు. దీంతో పరిటాల-సూరి వర్గీయులు ఒకరికొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో వరదాపురం సూరి వర్గీయులు ప్రయాణిస్తున్న 10-15 వాహనాలు ధ్వంసం అయ్యాయి. నలుగురు సూరి వర్గీయులకు గాయాలయ్యాయి.  దీంతో కాసేపు స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

పెనుకొండలో సోమవారం సాయంత్రం జరిగే చంద్రబాబు ‘రా.. కదలిరా’ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న వరదాపురం సూరి వర్గీయులు చంద్రబాబు సభకు వెళ్లకూడదంటూ పరిటాల శ్రీరామ్ వర్గీయులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇక ధర్మవరం టీడీపీ టికెట్‌ కోసం కొంతకాలంగా పరిటాల శ్రీరామ్ - వరదాపురం సూరి గొడవపడుతున్న సంగతి విదితమే.
చదవండి: నర్రెడ్డి సునీత యాక్షన్‌.. చంద్రబాబు డైరెక్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement