ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సమావేశంలో రచ్చరచ్చ

రేపిస్టుకు టికెట్: మహిళా కార్యకర్త ఆగ్రహం
దేవ్‌రియా: ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌రియాలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దేవ్‌రియా అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ముకుంద్ భాస్కర్‌మణికి ఖరారు చేశారు. దీనిపై నిర్వహించిన సమావేశంలో రేపిస్టుకు టికెట్ ఇవ్వడం ఏమిటని ఆగ్రహిస్తూ తారా యాదవ్ అనే మహిళా కార్యకర్త నిరసన వ్యక్తం చేశారు. సచిన్ నాయక్ అనే నేతపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. మిగిలిన కార్యకర్తలు తారా యాదవ్‌ను అడ్డుకున్నారు. ఇది సోషల్ మీడియా లో వైరలైంది. దీనిపై తారా నాయక్ నలుగురు కాంగ్రెస్ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తనను కొట్టి, అవమానించారని ఆరోపించారు. మహిళపై దాడి చేయడాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ తీవ్రంగా పరిగణించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ డీజీపీకి లేఖ రాశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి