రేపే నామినేషన్లు వేయనున్న కేసీఆర్‌ | Telangana Election 2023: CM KCR To File Nominations From Gajwel And Kamareddy - Sakshi
Sakshi News home page

రేపే నామినేషన్లు వేయనున్న కేసీఆర్‌.. కామారెడ్డిలో భారీ బహిరంగ సభ

Published Wed, Nov 8 2023 7:56 PM | Last Updated on Wed, Nov 8 2023 8:27 PM

cm kcr to file nomination in kamareddy gajwel  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రేపు(నవంబర్‌ 9, గురువారం) నామినేషన్లు వేయనున్నారు. రేపు ఒక్కరోజులోనే ఆయన పోటీచేయబోయే గజ్వేల్‌, కామారెడ్డిల్లో నామినేషన్‌లు దాఖలు చేస్తారు. ఆపై సాయంత్రం కామారెడ్డిలో జరిగే బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 

ఇదీ కేసీఆర్‌ షెడ్యూల్‌...

  • ఉదయం 10:45కు ఎర్రవెల్లి ఫాంహౌజ్‌ నుంచి గజ్వేల్‌కు హెలికాప్టర్‌లో బయలుదేరతారు.
  • 10:55కు గజ్వేల్ టౌన్‌లో ల్యాండ్‌ అవుతారు.
  • 11 నుంచి 12 గంటల మధ్య గజ్వేల్‌లో నామినేషన్‌ వేస్తారు. 
  • తర్వాత తిరిగి ఫాంహౌజ్‌ చేరుకుని లంచ్‌ చేస్తారు.
  • మధ్యాహ్నం 1:40కి కామారెడ్డికి బయలుదేరతారు.
  • మధ్యాహ్నం 2 నుంచి 3 మధ్య కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు.
  • సాయంత్రం 4నుంచి 5 మధ్య కామారెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement