మహారాజ్‌ ప్యాలెస్‌లో ఆహరం వడ్డించే విధానం ఇలా ఉంటుందా! | Sakshi
Sakshi News home page

మహారాజ్‌ ప్యాలెస్‌లో ఆహరం వడ్డించే విధానం ఇలా ఉంటుందా!

Published Tue, Apr 2 2024 10:18 AM

Harsh Goenka Shares Special Food Service Maharaja Gwaliors Palace

హోటల్స్‌, రెస్టారెంట్లలో వాటి రేంజ్‌ని బట్టి వివిధ విధానాల్లో సర్వింగ్‌ ఉంటుంది. కొన్నింటిలో బఫే లేదా సెల్ఫ్‌ సర్వింగ్‌ వంటివి ఉంటాయి. రాజుగారీ ఫ్యాలెస్‌లా ఉండే లగ్జరీయస్‌ హోటల్స్‌లో సర్వింగ్‌ విధానమే ఓ రేంజ్‌లో ఉంటుంది. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్‌పీజీ గ్రూప్‌ అధినేత హర్ష్‌ గొయెంకా మరో అద్భతమైన వీడియో నెటిజన్లతో పంచుకున్నారు. 

ఆ వీడియోలో గాల్వియర్‌ మహారాజ్‌ ప్యాలెస్‌లో ఆహారం సర్వింగ్‌ చేసే విధానం కనిపిస్తుంది. ఆ ప్యాలెస్‌లో బోజనం వడ్డించే పద్ధతి చాలా వెరైటీగా ఉంది. ఓ పెద్ద టేబుల్‌పై ట్రైయిన్‌ టాయ్‌లా ఉండే పట్టాల మధ్యలో వివిధరకాల పదార్థాల పాత్రాలను చక్కగా ఉంచారు. మరోవైపు ఆ పట్టాలపై నడుస్తున్న ట్రైయిన్‌ టాయ్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.

ఆ ట్రైయిన్‌ బోగిలపై గాల్వియర్‌ మహారాజ్‌ సింథియా పేరుకి సంబంధించినఅక్షరాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ ట్రైయిన్‌ టాయ్‌  పట్టాల మధ్య ఉన్న ఒక్కో ఆహార పదార్థం వద్దకు చకచక వస్తుంటుంది. అందుకు సంబంధించిన వీడియోకి "మహారాజ్‌ ప్యాలెస్‌లో ఆహారం ఎలా వడ్డిస్తారు" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ నెట్టింట షేర్‌ చేశారు హర్ష్‌ గోయెంకా. మీరు కూడా ఓ లుక్కేయండి.

 

Advertisement
 
Advertisement