ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్ | Chinna Reddy Reaction On Dismissal Planning Commission Vice Chairman | Sakshi
Sakshi News home page

ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్

Sep 3 2026 9:22 PM | Updated on Sep 3 2026 9:24 PM

Chinna Reddy Reaction On Dismissal Planning Commission Vice Chairman

సాక్షి, వనపర్తి: పదవిపై తనకు వ్యామోహం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తనను తొలగించడం పట్ల ఆయన స్పందిస్తూ..  సీఎంను కలవలేదు. కలవాలనే ప్రయత్నం చేయలేదన్నారు. కష్టపడి ఈ స్థాయికి వస్తే.. ఒక్క పోటుతో కూల్చేశారు. నేను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. కార్యకర్తలు నా దృష్టికి తీసుకొచ్చినా అంశాలనే మాట్లాడా అంటూ ఆయన వివరణ ఇచ్చారు.

పదవి ఉన్నా, లేకున్నా నా గౌరవం నాకుంది.. భవిష్యత్‌ కార్యాచరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చిన్నారెడ్డి అన్నారు. తన వర్గీయులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రావొద్దని.. వస్తే మెడలు పట్టి గెంటేస్తానని ఎమ్మెల్యే అంటున్నారని తనతో కార్యకర్తలు ఆవేదన వెలిబుచుకున్న సందర్భంలో మాత్రమే అలా మాట్లాడానని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement