కుప్పం వేదికగా చంద్రబాబు కని‘కట్టు’ కథ

Chandrababu Dramas With Rented Patients In Kuppam - Sakshi

సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం వేదికగా నిన్నటి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న హడావుడి అంతా ఇంతాకాదు. కందుకూరు, గుంటూరు టీడీపీ సభల్లో జనం చనిపోయిన ఉదంతాలను మరిపించి ప్రజల్లో సానుభూతి కోసం చంద్రబాబు చేస్తున్న డ్రామాలు పతాక స్థాయికి చేరాయి. పోలీసుల లాఠీఛార్జీలో తమ కార్యకర్తలు గాయపడ్డారంటూ నిన్నటి నుంచి గగ్గోలు పెట్టిన చంద్రబాబు… కనికట్టు కథ బట్టబయలైంది.


చంద్రబాబు రాకముందు చేతికి, తలకు ఎటువంటి కట్లు లేకుండా ఎదురుచూస్తున్న టీడీపీ కార్యకర్తలు

గురువారం కుప్పంలో ఆ కార్యకర్తలను పరామర్శించే ఒక సీన్‌ను చంద్రబాబు క్రియేట్‌ చేశారు. చంద్రబాబు పరామర్శకు వచ్చే సరికి మహానటులైన టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రిలో బెడ్ల మీద తమకు గాయాలతో బాధపడుతున్నట్టుగా ఒక స్టిల్‌ ఇచ్చారు. తీరా చంద్రబాబు రాగానే.. యథాలాపంగా తన వంతు పాత్రను రక్తికట్టించారు. వారిని ఓదారుస్తున్నట్టుగా, భరోసానిస్తున్నట్టుగా బ్రహ్మాండంగా స్టిల్స్‌ ఇచ్చారు.

ఈ పరామర్శ ముగిసిన తర్వాత చంద్రబాబు తన దైన శైలిలో రెచ్చిపోతూ మీడియాతో మాట్లాడారు. ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడారు. అంత వరకూ చూసేవాళ్లకు బాగానే ఉంది. కాకపోతే.. ఇక్కడే ఒక ట్విస్ట్‌. చంద్రబాబు కనికట్టు కథ… బట్టబయలైంది. ఇలా చంద్రబాబు వెళ్లారో లేదో… ఆ వెంటనే మహా నటులైన టీడీపీ కార్యకర్తలు తమ బెడ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. చంద్రబాబు పరామర్శ సమయంలో కనికట్టు కన్నీరు పాలైన ఆ వార్డు.. తర్వాత ఖాళీగా దర్శనమిచ్చింది.


బాబు వచ్చారు..పరామర్శ డ్రామా మొదలెట్టారు


చంద్రబాబు వెళ్లగానే వార్డులో ఖాళీగా దర్శనమిస్తున్న బెడ్లు


సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న మీమ్‌

డ్రామాను చంద్రబాబు రక్తికట్టిస్తున్న తీరు..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top