
సాక్షి, నంద్యాల: జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి, టీడీపీ నేత ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహణపై పెద్ద రచ్చే జరిగింది. తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి చెప్పకుండా ఎలా నిర్వహిస్తారంటూ బుడ్డా అనుచరులు రెచ్చిపోయారు.
ఎంపీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటి అద్దాలను బుడ్డా వర్గీయులు ధ్వంసం చేశారు. బుడ్డా అనుచరులు.. ఏరాసుపై చేయి చేసుకున్నారు. ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు.
