యువకుడి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

యువకుడి బలవన్మరణం

Mar 1 2026 7:33 AM | Updated on Mar 1 2026 7:33 AM

యువకు

యువకుడి బలవన్మరణం

కోవెలకుంట్ల: సౌదరదిన్నెకు చెందిన ఓ యువకుడు క్రిమి సంహారక మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శనివారం ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన ఏరాశి సుదర్శన్‌రెడ్డి (29) మద్యానికి బానిసకావడంతోపాటు కొన్ని రోజుల నుంచి కామెర్ల వ్యాధితో బాధపడుతున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో మద్యం తాగడం మానేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కుటుంబ సభ్యులు సూచించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది గురువారం రాత్రి క్రిమి సంహారక మందు తాగి ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుని తండ్రి హిమమంతరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

గుండెపోటుతో ఆర్టీసీ ఉద్యోగి మృతి

ఎమ్మిగనూరురూరల్‌: స్థానిక ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. పట్టణంలోని లక్ష్మీపేటలో నివాసముంటున్న ఎం. లక్ష్మీరెడ్డి(56)కి, భార్య లలిత, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆర్టీసీ డిపోలో కండెక్టర్‌గా పని చేసిన ఇతను ప్రస్తుతం ఎర్నింగ్‌ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి డ్యూటీ కావడంతో విధులు నిర్వహిస్తుండగా తెల్లవారుజామున కడపులో మంట, ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పటంతో తోటి ఉద్యోగులు చికిత్స కోసం ప్రభుత్వాసుప్రతికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందాడు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న డిపో మేనేజర్‌ మద్దిలేటినాయుడు, నేషనల్‌ మజ్దూర్‌ యూనియర్‌ డిపో కార్యదర్శి ముస్తాక్‌ అహ్మద్‌ తదితరులు ప్రభుత్వాసుపత్రికి వెళ్లి నివాళులర్పించారు.

భర్త మద్యానికి బానిసయ్యాడని..

రుద్రవరం: మద్యానికి బానిసైన భర్తలో మార్పు రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ జయప్ప తెలిపిన వివరాల మేరకు.. అప్పనపల్లెకు చెందిన రాధాకృష్ణ, శివలక్ష్మి(30) దంపతులు వ్యవసాయ కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా రాధాకృష్ణ మద్యానికి బానిస అయ్యాడు. మద్యం తాగడం మానుకోమని భర్తకు పలుమార్లు చెప్పినా వినిపించుకోలేదు. ఈ విషయంపై వారిద్దరి మధ్య శనివారం వాగ్వావాదం నెలకొంది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఆగిన గూడ్సు రైలు

బేతంచెర్ల: మండల పరిధిలోని ఆర్‌ఎస్‌. రంగాపురం రైల్వే గేటు వద్ద శనివారం సాయంత్రం గూడ్సు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డోన్‌ వైపు వెళ్తున్న రైలు సాంకేతిక కారణాలతో గేటు మధ్యలోనే అరగంటకు పైగా ఆగిపోయింది. దీంతో డోన్‌, కర్నూలు, నంద్యాల వైపు వెళ్లాల్సిన వాహనదారులు, మద్దిలేటి స్వామిని దర్శించుకుని తిరిగి వెళ్తున్న భక్తులు వాహనా లు భారీగా నిలిచిపోయాయి. అరగంట తర్వాత రైలు ముందుకు కదలడంతో ట్రాఫిక్‌ క్లియర్‌ కావడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

దేవనకొండ: వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవనకొండ సీఐ వేణుగోపాల్‌ తెలిపిన వివరాల మేరకు.. తుగ్గలి మండలం రాతన గ్రామానికి చెందిన సుభాషిణి (26)కి దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామా నికి చెందిన చాకలి కౌలుట్లయ్యతో పదేళ్ల క్రితం వివాహమైంది. సుభాషిణికి ఇద్దరు పిల్లలు. కొన్నేళ్ల క్రితం కౌలుట్లయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో మతిస్థిమితం కోల్పోయాడు. ఈ క్రమంలో పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామానికి చెందిన చాకలి ఉమాకాంత్‌తో సుభాషిణికి వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఏమి జరిగిందో తెలియదు కానీ.. ఈనెల 23వ తేదీన సుభాషిణి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కుటుంబీకులు ఆమె మొబైల్‌ ఫోన్‌ పరిశీలించగా అందులో ఉమాకాంత్‌ వాట్సాప్‌లో చేసిన చాటింగ్‌, ఫొటోలు బయటపడ్డాయి. సుభాషిణిని భయపెట్టినట్లు తెలియడంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

యువకుడి బలవన్మరణం 1
1/1

యువకుడి బలవన్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement