మూడు చోట్ల గుర్తు తెలియని మృతదేహాలు
నంద్యాల(అర్బన్): నంద్యాల మండలం అయ్యలూరు గ్రామ చెరువు సమీపంలో గుర్తు తెలి యని మృతదేహం లభ్యమైనట్లు రూరల్ పోలీసులు శనివారం తెలిపారు. నీటిలో చనిపోయిన 35 ఏళ్ల వ్యక్తి ఎడమ చేయిపై రమేష్, సిద్ధమ్మ పచ్చబొట్టు ఉంది. ఇతని ఆచూకీ తెలిసిన వారు నంద్యాల తాలూకా పోలీసు స్టేషన్ సీఐ (9121101092), ఎస్‌ఐ (9985865553)ను సంప్రదించాలన్నారు.
పంట పొలాల్లో..
ఉయ్యాలవాడ: పెద్ద యమ్మనూరు –సుద్దపల్లె గ్రామా ల మధ్య ఉన్న పంటపొలాల్లో గుర్తుతెలియని వ్యక్తి శవం బయటపడింది. మృతుడికి 48–50 ఏళ్లలోపు వయస్సు ఉంటుందని స్థానికులు తెలిపారు. పొలాల్లోకి వెళ్లిన రైతులు వ్యక్తి శవం కనిపించడంతో పోలీసులకు సమాచా రం ఇచ్చారు. ఈ మే రకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతుడి వివరాలను సేకరిస్తున్నారు. పూర్తి విరా లు తెలియాల్సి ఉంది.
మహిళా మృత దేహం లభ్యం..
రుద్రవరం: చిలుకలూరు సమీపంలో మహిళా మృతదేహం బయట పడింది. ఎస్‌ఐ జయప్ప తెలిపిన వివరాల మేరకు.. చిలుకలూరు గ్రామ సమీపంలోని పగిడివాగు వద్ద పూర్తిగా కుళ్లిన మృతదేహాన్ని ప్రజలు గుర్తించారు. పోలీసులు బయటకు తీసి పరిశీలించగా మహిళ వయస్సు 30 నుంచి 40 ఏళ్లు ఉంటుందని మృతదేహంపై నల్లపూసల దండ, ముక్కుపుడక, మెరూన్ రెడ్ కలర్ పైజాము ఉన్నాయి. ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు.
మూడు చోట్ల గుర్తు తెలియని మృతదేహాలు


