తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్‌.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌ | Huzurabad BRS MLA Padi Kaushik Reddy Arrested In Shamshabad Airport, Watch Full Video For More Details | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్‌.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌

Jun 21 2025 7:05 AM | Updated on Jun 21 2025 9:00 AM

BRS MLA Kaushik Reddy Arrest

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. హుజూరాబాద్ బీఆర్‌ఎస్‌ ఎ‍మ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక గ్రానైట్ వ్యాపారిని బెదిరించారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కౌశిక్‌రెడ్డిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్ట్‌ చేశారు. దీంతో, తెలంగాణ రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

వివరాల ప్రకారం.. గ్రానైట్‌ వ్యాపారి మనోజ్ రెడ్డి అనే వ్యక్తిని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. మనోజ్ రెడ్డి కమలాపూరం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్నారు. తమను రూ.50 లక్షలు ఇవ్వాలని కౌశిక్‌ రెడ్డి బెదిరించారని ఫిర్యాదు పేర్కొన్నారు. మనోజ్ భార్య ఉమాదేవీ సుబేదారీ పీఎస్‌లో కౌశిక్‌ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు.. శనివారం తెల్లవారుజామున కౌశిక్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు.

పాడి కౌశిక్‌ రెడ్డిపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 308(2), 308(4) మరియు 352 కింద ఆయనపై అభియోగాలు మోపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కౌశిక్‌ రెడ్డి.. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. కక్షపూరితంగానే తనను అరెస్ట్‌ చేస్తున్నట్టు ఘాటు విమర్శలు చేశారు. ఇక, ఈరోజు ఉదయం కౌశిక్‌ రెడ్డిని పోలీసులు.. కోర్టులో హాజరు పరుచునున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement