BRS MLA Chinnam Durgaiah Victim Sejal Protest At Parliament - Sakshi
Sakshi News home page

మణిపూర్‌ ఘటనే కనిపిస్తోందా?.. పార్లమెంట్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాధితురాలు

Jul 28 2023 12:50 PM | Updated on Jul 28 2023 1:27 PM

BRS MLA Chinnam Durgaiah Victim Sejal Protest At Parliament - Sakshi

సొంత రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు బీఆర్‌ఎస్‌కు కనిపించడం.. 

సాక్షి, ఢిల్లీ: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద లైంగిక ఆరోపణలు చేస్తున్న శేజల్‌ మరోసారి ఢిల్లీలో హల్‌ చల్‌ చేసింది. తనకు న్యాయం చేయాలంటూ శుక్రవారం ఏకంగా పార్లమెంట్‌ ఎదుటే నిరసనకు దిగిందామె.  

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించారని, మోసం చేసారని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆరిజన్ డైరీ ప్రతినిధి శేజల్ ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్, సీబీఐకి సైతం చిన్నయ్యపై ఫిర్యాదు చేసిందామె. అయినా స్పందన కొరవడడంతో తెలంగాణ భవన్‌ వద్ద ఆత్మహత్యయత్నానికి కూడా యత్నించింది. 

ఇక కేటీఆర్ ,బీఆర్ఎస్ ఎంపీల దృష్టికి తన సమస్యను తీసుకెళ్లినప్పటికీ లాభం లేకుండా పోయిందని వాపోతుందామె. ‘‘పేరుకు మాత్రమే చట్టాలు..ఆడపిల్లకి న్యాయం చేయలేని చట్టాలు ఎందుకు?. మణిపూర్ లో మహిళలపై జరిగిన ఘటన చాలా బాధాకరం. కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సొంత రాష్ట్రంలో మహిళ పై జరిగిన విషయం మీద స్పందించే సమయం దొరకడం లేదు.  అదే పక్క రాష్ట్రాలలో జరిగిన ఘటనలు మీద మాత్రం క్షణాల్లో స్పందించి రాజకీయాలు చేసుకోవడం పరిపాటిగా మారింది’’ అని ఘాటుగా వ్యాఖ్యానించిందామె. 

మహిళల లైంగిక వేధింపులకు సంబంధించి  ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద FIR ఇవ్వమని పోలీస్ స్టేషన్‌కి  వెళ్తే..  ఇవ్వకపోగా తిరిగి తన మీదే తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తోందామె. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అయిన స్పందించి ఎమ్మేల్యే దుర్గం చిన్నయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేసి తక్షణమే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని.. చిన్నయ్య మీద కేసు నమోదు చేసే వరకు తన పోరాటం ఆగదని చెబుతోంది శేజల్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement