BJP Tarun Chugh Slams Revanth Reddy On KCR Close To Kharge - Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కేసీఆర్, ఖర్గే చేతులు కలిపారు.. రేవంత్‌ పరిస్థితి ఏంటో!

Jun 16 2023 7:51 AM | Updated on Jun 16 2023 11:43 AM

BJP Tarun Chugh Slams Revanth Reddy On KCR Close To  Kharge - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఢిల్లీ స్థాయిలో చేతులు కలిపారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌ ఛుగ్‌ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌కు కొన్ని సందర్భాల్లో బీ టీంగా, కొన్నిసార్లు సీ టీంగా పనిచేసేందుకు పోటీ పడుతోందని ఛుగ్‌ ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తన పరిస్థితి ఏంటో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆలోచించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం రేవంత్‌ రెడ్డి ఎలా మరిచిపోయారని, ఇది బీఆర్‌ఎస్‌ – కాంగ్రెస్‌ సంస్కృతి అని విమర్శించారు. అయితే ఇందుకు భిన్నంగా బీజేపీ– బీఆర్‌ఎస్‌ల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని రేవంత్‌ మాట్లాడడం కేవలం అభూత కల్పన అని అన్నారు. గురువారం ఢిల్లీ సౌత్‌ ఎవెన్యూలోని తన నివాసంలో తరుణ్‌ ఛుగ్‌ మీడియాతో మాట్లాడారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని మార్చేది లేదని పార్టీ జాతీయ నాయకత్వం స్పష్టత ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు దు్రష్పచారం చేస్తున్నారని ఛుగ్‌ మండిపడ్డారు. 

25న నాగర్‌ కర్నూల్‌కు నడ్డా 
ఈనెల 25న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు వస్తున్నారని తరుణ్‌ ఛుగ్‌ తెలిపారు. నాగర్‌ కర్నూల్‌ సభలో నడ్డా పాల్గొంటారన్నారు. గుజరాత్‌లో బిపర్‌ జోయ్‌ తుపాను వల్ల అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దయ్యిందని, త్వరలో ఖమ్మంలోనే షా సభ ఉంటుందన్నారు. 
చదవండి: మోదీ మంచి మిత్రుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement