'ఉండవల్లి గారు.. ఊసరవెల్లిగా మారొద్దు!' | BJP Leader Vishnuvardan Reddy Fires On Undavalli Arunkumar In Twitter | Sakshi
Sakshi News home page

'ఉండవల్లి గారు.. మీరు ఊసరవెల్లిగా మారవద్దు!'

Dec 24 2020 1:33 PM | Updated on Dec 24 2020 2:38 PM

BJP Leader Vishnuvardan Reddy Fires On Undavalli Arunkumar In Twitter - Sakshi

సాక్షి, అమరావతి : బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై ట్విటర్లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ' ఉండవల్లి గారు .. మీరు ఊసరవల్లిగా మారవద్దు! బిజేపీలో ఎందుకు చేరాలి? ఎందుకు చేరకూడదు? చేరే వాళ్లకు తెలుసు. రాజకీయ అస్త్ర సన్యాసం చేసిన మీలాంటి వారి సలహాలు వారు ఎందుకు తీసుకుంటారు. మీ భ్రమ తప్ప... మీరు ఎవరికోసం మాట్లాడుతున్నారు? ఏ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో బతికించాలి? అని తాపత్రయ పడుతున్నారో దాని వెనుక ఉన్న రహస్యం రాష్ట్ర ప్రజలకు తెలుసు. (చదవండి : ‘రైతులను దేశ ద్రోహులని భావిస్తే పాపం చేసినట్లే’)

ఆర్ఎస్ఎస్ గురించి మీరు చాలా విమర్శలు చేశారు. మీరు నమ్మి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ మీ మాజీ ప్రధాని నెహ్రూ గారు 1963 జనవరి 26 న ఆర్ఎస్ఎస్ ను స్వాతంత్ర దినోత్సవ వేడుకల పెరేడ్ లో ఆహ్వానించారు. మీకే చరిత్ర తెలిసినట్లు 80 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్ఎస్ఎస్ గురించి నేడు మీరు వక్రీకరించి హేళనగా మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో నేడు అత్యున్నతమైన రాష్ట్రపతి,ఉప రాష్ట్రపతి, ప్రధాని లాంటి పదవులలో దేశం కోసం పనిచేస్తున్నారు. మేధావులు కదా ఈ చరిత్ర తెలియదా? తెలియకపోవచ్చులే. మనం మేధావి ముసుగులో ఉన్నాం కదా! ' అంటూ చురకలంటించారు.(చదవండి : రాయపాటి లూటీలో బాబు వాటా ఎంత?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement