ఉద్యోగులు టీఆర్‌ఎస్‌ నేతలను ఉరికించి కొడతారు

BJP Leader Muralidhar Rao Slams KCR KTR And TRS Over PRC - Sakshi

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం ప్రజాస్వామ్య విరుద్ధం

ఇంత తక్కువ ఫిట్‌మెంట్‌ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే: మురళీధర్‌ రావు

సాక్షి, హైదరాబాద్‌: చదువు ఎక్కువ అయితే ఉన్న మతి పోతుందనే విషయం కేటీఆర్‌ను చూస్తే నిజం అనిపిస్తుంది. తెలంగాణ రావడంలో సుష్మాస్వరాజ్.. అరుణ్ జైట్లీ ప్రమేయం ఉందా లేదా పార్లమెంట్ ప్రొసిడింగ్స్ చూసి తెలుసుకోండి. కేటీఆర్‌ ఓ చిన్న పిల్లాడిలా తెలంగాణ రావడానికి టీఆర్ఎస్ బాధ్యత అని చెప్తున్నారు. ఆయన మాటలు వింటుంటే భారతదేశాన్ని అభివృద్ధి చేసింది మేమే అని బ్రిటిష్ వాడు చెప్పినట్టు ఉంది అంటూ మధ్యప్రదేశ్‌ బీజేపీ ఇన్‌చార్జ్‌ మురళీధర్‌ రావు ఎద్దేవా చేశారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశలో ఆయన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, పీఆర్సీ నివేదికపై మండి పడ్డారు. మురళీధర్‌ రావు మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం అంటే పార్లమెంటరీ వ్యవస్థను అవమానించడమే. పార్లమెంట్‌ చరిత్రలో చట్టం ఆమోదించిన తర్వాత 13 సార్లు చర్చలు జరపడం.. ర్యాలీకి అనుమతివ్వడం వంటివి చేసిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. రిపబ్లిక్‌ డే నాడు చెలరేగిన హింస కాంగ్రెస్‌ పన్నిన కుట్రే. ఆ పార్టీ మద్దతు లేకపోతే దుండగులు ఎర్రకోట వరకు రాలేరు’ అని మురళీధర్‌ రావు ఆరోపించారు.

రాముడిని విమర్శిస్తే కనుమరుగవుతారు
‘‘దేశవ్యాప్తంగా నడుస్తోన తీర్థా ట్రస్ట్‌ కార్యక్రమాలను తెలంగాణలో తప్ప ఎక్కడా.. ఎవరు అడ్డుకోలేదు. షాడో వార్‌ చేయడం కాదు.. కేసీఆర్ ఎమ్మెల్యేలకు బదులుగా తనే నేరుగా మాట్లాడాలి. రాముడిని విమర్శిస్తే.. కనుమరుగవడం ఖాయం. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారు.. పార్టీలకతీతంగా విరాళాలు ఇస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం ముఖ్యనేతలు విమర్శిస్తున్నారు. ఈ వైఖరి సరైంది కాదు’’ అని హెచ్చరించారు.
(చదవండి: సీఎం పీఠంపై కేటీఆర్‌ ఖాయమే!)

ఉద్యోగుల కడుపు కొట్టాలని చూస్తున్నారు
‘‘కేసీఆర్‌ ప్రభుత్వం పెరాలసిస్‌ గవర్నమెంట్‌. పీఆర్‌సీ రెండేళ్లు ఆలస్యంగా ఇచ్చింది. అది కూడా దేశంలోకెల్లా అత్యంత తక్కువ. గతంలో 1974లో అప్పటి ప్రభుత్వం 5శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇంత తక్కువ ఏ రాష్ట్రం ఇవ్వలేదు. కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి.. ఉద్యోగుల కడుపుకొట్టాలని చూస్తున్నారు.  కరోనా వల్ల ఇంటి అద్దెలు ఏమైనా తగ్గాయా. ప్రభుత్వ వైఖరి ఇలానే కొనసాగితే.. ఉద్యోగులు టీఆర్‌ఎస్‌ నేతలను చెప్పులు లేకుండా ఉరికించి కొడతారు. ఉద్యోగులకు గ్రాట్యూటి కేంద్రం ప్రభుత్వంతో సమానంగా ఇవ్వాలి. రాష్ట్రంలో ఓ వైపు నిరుద్యోగం.. మరోవైపు కాంట్రాక్టర్ల దోపిడి పెరిగిపోతుంది. దీనికి చరమ గీతం పాడాలి’’ అన్నారు మురళీధర్‌ రావు. 
(చదవండి: ఫిట్‌మెంట్‌ 7.5%.. అంత తక్కువైతే.. మాకొద్దు)

‘‘తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థి.. వ్యతిరేకి టీఆర్ఎస్‌నే. బీజేపీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటెసే వారు బీజేపీకే వేస్తున్నారు. టీఆర్ఎస్‌ను కొట్టేది బీజేపీనే అని ప్రజలు డిసైడ్ అయ్యారు. పార్టీలు వాటికవే గ్రేట్ కాదు.. సిద్దాంతాలు.. పోరాటాలు ద్వారానే ప్రజలు గెలిపిస్తారు.తిట్టిన కొద్ది పెరిగేది బీజేపీ పార్టీ. ఎవరికి భయపడి పార్టీ కాదు. ప్రాణాలకు భయపడకండా పోరాటం చేసిన చరిత్ర తెలంగాణలో ఒక్క బీజేపీకే ఉంది’’ అన్నారు మురళీధర్‌ రావు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top