ఏపీకి సరే.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఎవరు: బండి సంజయ్‌

BJP Bandi Sanjay Slams CM KCR Over BRS In AP  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌తో మళ్లీ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. సోమవారం నాటి సమావేశంలో సీఎం కేసీఆర్‌ కనీసం జై తెలంగాణ అని కూడా అనలేదని తెలిపారు. బీఆర్‌ఎస్‌కు తెలంగాణలో అధ్యక్షుడు లేడు కానీ ఏపీకి ప్రకటించారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు జాతీయ అధ్యక్షుడు ఎవరని ప్రశ్నించారు.

‘ఏపీ నేతల్ని కేసీఆర్‌ పిలిపించుకుని జాయిన్‌ చేసుకున్నారు. వాళ్లను తీసుకొచ్చేందుకు వందకు పైగా కార్లను పంపించారు. గత ఎన్నికలకు ముందు తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చాడు.. ఆంధ్రవాళ్లను తిట్టాడు. ఆంధ్రా బిర్యానీని పెండ బిర్యానీ అని తిట్టావు కదా. ప్రైవేటీకరణపై మాట్లాడుతున్న కేసీఆర్‌.. ఆర్టీసీనీ ఎందుకు ప్రైవేటైజేషన్‌ చేస్తున్నావు. విద్యుత్‌ చార్జీలు పెంచారు. పోలవరంపై కేసీఆర్‌ స్టాండ్‌ ఏంటి’ అని బండి సంజయ్‌ కేసీఆర్‌ను ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top