
సాక్షి, తిరుపతి: చంద్రబాబు జీవితమంతా రక్తసిక్తమేనని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అంటూ మండిపడ్డారు.
‘‘జైల్లో బాబుకు భద్రత లేదని కుటుంబసభ్యులనడం హాస్యాస్పదం. చట్టాలకు ఎవరూ అతీతులు కారు. చట్టానికి అందరూ లోబడి ప్రవర్తించాల్సిందే. చంద్రబాబు అరెస్ట్‌ను ప్రజలు పట్టించుకోవడం లేదు’’ అని భూమన పేర్కొన్నారు.
చంద్రబాబు పాలనలో అవినీతిపై మిగిలిన కేసులన్నీ వేగవంతం చేయాలి. రాజధాని ఇన్నర్ రోడ్డు ఎలైన్‌మెంట్ స్కాం, సాగునీటి ప్రాజెక్టులు స్కాం, ఈఎస్‌ఐ స్కాం అన్నింటిలో విచారణ వేగవంతం చేయాలి’’ అని భూమన డిమాండ్ చేశారు.
చదవండి: బాబు, పవన్ ఫెవికాల్ బంధం.. ఎవరేమైతే మాకేంటి?