'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్ | Bengal Governor C V Ananda Bose About Mamata Banerjee | Sakshi
Sakshi News home page

'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్

May 6 2024 9:22 PM | Updated on May 6 2024 9:24 PM

Bengal Governor C V Ananda Bose About Mamata Banerjee

కోల్‌కతా: ఇటీవల పశ్చిమ బెంగాల్ గవర్నర్ 'సీవీ ఆనంద బోస్' మీద లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. దీనిపైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీఎంసీ అధినేత్రి వ్యాఖ్యలపై ఆనంద బోస్ స్పందించారు.

తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ మాట్లాడుతూ.. నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి నన్ను రాజకీయాల్లోకి లాగుతున్నందుకు చాలా చింతిస్తున్నాను.

ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో.. అవమానకరమైన వ్యాఖ్యల చేశారు. ఒక రాజకీయ నాయకురాలిగా ఆమె ఆలా మాట్లాడకూడదు. ఆమెను (మమతా బెనర్జీ) రక్షించమని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇది దేవునికి కూడా కష్టతమైన బాధ్యత. నేను ఎప్పుడూ 'దీదీ గిరి'ని అంగీకరించను అని పశ్చిమ బెంగాల్ గవర్నర్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement