మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అరెస్ట్‌

Bengal Congress Spokesperson Arrested Remarks Against Mamata - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత కౌష్టవ్ బాగ్చీని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఉదయం 3:30 గంటల సమయంలో ఆయన నివాసంపై రైడ్లు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని బర్రాక్‌పోర్ నివాసంలోనే బాగ్చీని అరెస్టు చేసినట్లు బెంగాల్ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలిపేందుకు మాత్రం నిరాకరించారు.

సాగర్‌డిగీ అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం  సాధించారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరిపై మమతా బెనర్జీ వ్యక్తిగత విమర్శలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌష్టవ్ బాగ్చీ.. మమతా బెనర్జీని కించపరిచేలా శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

కౌష్టవ్ బాగ్చీ బెంగాల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. వృత్తిరీత్యా లాయర్. ఈయన అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనలకు దిగాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
చదవండి: ఈ మెట్రో స్టేషన్లలో మొత్తం మహిళా సిబ్బందే.. ఎందుకంటే?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top