ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి

Published Mon, Sep 11 2023 3:00 AM

Bandi Sanjay Comments on BRS Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా­స్వామ్య తెలంగాణ ఏర్పా­టు లక్ష్యంగా జరుగుతున్న పోరాటానికి మద్దతివ్వాలని ప్ర­వాస భారతీయులకు బీజేపి జాతీయ ప్రధాన కార్య­దర్శి, ఎంపీ బండి సంజయ్‌  పిలుపు­నిచ్చా­రు. తెలంగాణలో అంతో ఇంతో అభివృద్ధి జరు­గుతోందంటే ప్రధాని మోదీ ప్రభుత్వం ఇస్తున్న నిధులవల్లేనని చెప్పారు. ముఖ్యంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటికీ కేంద్రమే నిధులిస్తోందని తెలిపారు.

రాష్ట్రంలో అవినీతికి పాల్పడటం తప్ప బీఆర్‌ఎస్‌ ప్రభు­త్వం చేస్తున్న అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజె­ర్సీలో ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ అఫ్‌ బీజేపీ (ఓఎఫ్‌­ఓబీ) ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సంజయ్‌ మాట్లాడారు.  ప్రవాస భారతీ­యులు ఎన్నికల సమయంలో కచ్చితంగా కనీ­సం 15 రోజుల సమయమైనా వెచ్చించి దేశా­నికి రావాలని కోరారు.

రాష్ట్రంలో అవినీ­తిని నిర్మూలించడంతోపాటు పేదలకు పక్కా గృహ సదుపాయం, నిరక్షరాస్యత నిర్మూలన, ఉన్నత విద్యావ్యాప్తితోపాటు  తాగు, సాగు నీటి ప్రాజె­క్టులను పెద్ధ ఎత్తున నిర్మించాల్సిన అవసర­ముందన్నారు. కార్య­క్రమంలో  కృష్ణారెడ్డి అనుగుల (ఓఎఫ్‌ఓబీ జాతీ­య పూర్వ అధ్య­క్షులు), ప్రవాస భారతీ­యులు వి­లాస్‌ రెడ్డి, జంబుల  సంతోష్‌ రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి తుమ్మల, వంశీ యంజాల, ప్రదీప్‌ రెడ్డి కట్ట పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement