విజయసాయి మాటలు నమ్మొద్దు.. ఆడియో రిలీజ్‌ చేసిన రాజ్‌ కసిరెడ్డి | Audio Release: Raj Kasireddy Said Dont Believe Vijaya Sai Says | Sakshi
Sakshi News home page

విజయసాయి మాటలు నమ్మొద్దు.. ఆడియో రిలీజ్‌ చేసిన రాజ్‌ కసిరెడ్డి

Apr 19 2025 4:45 PM | Updated on Apr 20 2025 10:10 AM

Audio Release: Raj Kasireddy Said Dont Believe Vijaya Sai Says

సాక్షి, అమరావతి: విజయసాయి చెప్పే మాటలు నమ్మొద్దంటూ మీడియాకు రాజ్‌ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. త్వరలోనే విజయసాయి బండారం బయటపెడతానన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. న్యాయపరమైన  ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.

‘‘సిట్‌ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించా. మార్చిలో సిట్‌ అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశా. న్యాయపరమైన రక్షణ తర్వాత విచారణకు హాజరవుతా. సాక్షిగా పిలిచి అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని లాయర్లు చెప్పారు. అందుకోసమే న్యాయస్థానాన్ని ఆశ్రయించాను’’ అని రాజ్‌ కసిరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement