16th Dec : AP పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

AP Political News Dec 16th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Sat, Dec 16 2023 8:02 AM

AP Political Updates16th December - Sakshi

AP Elections Political Latest Updates Telugu

07:05 PM, Dec 16th, 2023
ఏం చేద్ధాం.? క్యాడర్‌ను ఎలా ఒప్పిద్దాం?

 • నెల్లూరులో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణెదెల నాగబాబు పర్యటన
 • నెల్లూరులో ఇవాళ, రేపు నియోజకవర్గాల వారీగా జనసేన సమీక్షలు
 • ఉదయం సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల సమీక్ష
 • మధ్యాహ్నం కావలి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల సమీక్ష
 • రేపు ఉదయం నెల్లూరు, కోవూరు, సుళ్లూరుపేట నియోజకవర్గాల సమీక్ష
 • జనసేన - తెలుగుదేశం పొత్తును వ్యతిరేకించొద్దంటూ పార్టీ కార్యకర్తలను కోరనున్న నాగబాబు

06:59 PM, Dec 16th, 2023
ఏపీలో ఎన్నికల ఏర్పాట్లు

 • ఈనెల 21కి ఏపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతినిధులు
 • 22న కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
 • 23న అన్ని శాఖల రాష్ట్రస్థాయి అధికారులతో సమావేశం

06:39 PM, Dec 16th, 2023
సామాజిక విప్లవం, సామాజిక సాధికారికత : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

 • నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలు అందిస్తూ, పేదల ఆర్థిక స్థాయిని పెంచిన ముఖ్యమంత్రి జగనన్న.
 • ఈ రోజు ఏ ఒక్కరూ పిల్లల చదువులు ఎట్లరా దేవుడా? అని తల పట్టుకునే పరిస్థితి లేదు.
 • ఇల్లు గడవడం ఎలా అని ఆలోచించే పనిలేదు
 • ఏ జబ్బు వచ్చినా భయపడాల్సిన పనిలేదు.
 • మంచిమనసున్న జగనన్న వల్ల ప్రజలకు జరుగుతున్న మంచి అంతా ఇంతా కాదు.
 • నిజంగానే సామాజిక విప్లవం ద్వారా సామాజిక సాధికారత జరిగింది
 • ఆర్థికంగా పేదలను జగనన్న పైస్థాయికి తీసుకువచ్చారు.
 • చంద్రబాబును నమ్మితే మనం పూర్తిగా మునిగినట్టే.
 • బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలను చులకనగా చూసి, అవమానాల పాలు చేసినవాడు చంద్రబాబు.
 • సింహంలాంటి జగనన్న అడుగుల్లో అడుగులేసి ముందుకు సాగుదాం.

06:33 PM, Dec 16th, 2023
ఎల్లో మీడియా ట్రాప్‌లో పడొద్దు : అనిల్‌ కుమార్‌ యాదవ్‌

 • గత 45 రోజులుగా మూడుప్రాంతాల్లో సామాజిక సాధికారయాత్ర జరుగుతోంది.
 • విజయవంతంగా జరుగుతోంది. జనం తరలివస్తున్నారు.
 • పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ బడుగు, బలహీనవర్గాలకు ఎంతో గుండె ధైర్యాన్నిచ్చారు.
 • చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు.
 • నా ఎస్సీ,నాఎస్టీ, నాబీసీ, నా మైనార్టీలంటూ వారిని అక్కున చే ర్చుకున్నారు
 • వారిని చెయ్యిపట్టి ముందుకు నడిపిస్తున్నారు.
 • కలలో కూడా ఊహించని రీతిలో బడుగు, బలహీనవర్గాల వారికి రాజకీయపదవులిచ్చారు.
 • కార్పొరేషన్లలో ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవులిచ్చారు. మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ పదవులిచ్చారు.
 • రాజకీయంగా వెనుకబడ్డవర్గాల స్థాయిని పెంచారు
 • సంక్షేమపథకాల ద్వారా పేదల ఆత్మగౌరవాన్ని పెంచిన సీఎం... జగనన్న.
 • లబ్దిదారులకు నేరుగా ఇంటిగడప దగ్గరే సంక్షేమ ఫలాలు అందిస్తున్న పాలన ఇది
 • ఎల్లోమీడియా రాతలు నీచంగా ఉన్నాయి.
 • పేదపిల్లలకు ట్యాబులిచ్చినా వారి కడుపులు మండిపోతున్నాయి.
 • పేదబిడ్డల ఇంగ్లీషు మీడియం చదువులు కూడా వారికి కంటగింపుగా ఉంది.
 • జగనన్న చేస్తున్న మంచిపనులన్నీ పచ్చ మందకు నచ్చట్లేదు. ప్రజలకు మేలు జరిగితే వారు సహించలేరు.
 • ఎల్లోమీడియా నెత్తినెత్తుకున్న చంద్రబాబు గురించి రాష్ట్రప్రజలందరికీ తెలుసు.
 • కుట్రలు,కుతంత్రాలతోనే చంద్రబాబు రాజకీయం చేస్తారు.
 • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూస్తారు.
 • గుండెల్లో పెట్టుకుని చూసుకునే జగనన్న కావాలా?
 • గడప బయటే నిలబెట్టే చంద్రబాబు కావాలా?
 • బాగా ఆలోచించి నిర్ణయించుకోండి.
 • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారు, మహిళలు అందరూ జగనన్నను గెలిపించుకోవాలి.

06:25 PM, Dec 16th, 2023
టిడిపి టికెట్‌ కోసం రఘురామ పాట్లు

 • హైదరాబాద్ లో ‘డీకోడింగ్ ద లీడర్’ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న రఘురామ కృష్ణరాజు
 • చంద్రబాబును ఎత్తడానికి నానా పాట్లు పడ్డ రఘురామ
 • హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది చంద్రబాబు అని చెప్పడానికి ప్రయత్నం
 • సైబరాబాద్‌ను తెచ్చాడని, విజనరీ అంటూ చంద్రబాబు కారెక్టర్‌ను పైకి లేపేందుకు ప్రయత్నం

06:05 PM, Dec 16th, 2023
టిడిపి ఉద్యోగాలివ్వలేదు, ఉపాధి కల్పించలేదు :  మంత్రి మేరుగ

 • చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున మండిపాటు
 • టీడీపీ హయాంలో ఎన్నిఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలి
 • DSc గురించి చంద్రబాబు చెప్పాల్సిన అవసరం లేదు
 • పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు
 • హోదా గురించి మాట్లాడే హక్కు బాబుకు లేదు
 • మేం ఎక్కడ పోటీ చేస్తే చంద్రబాబుకు ఎందుకు? : మంత్రి మేరుగు నాగార్జున

05:45 PM, Dec 16th, 2023
ఉత్తరాంధ్రకు తెలుగుదేశం అన్యాయం చేసింది : YSRCP

 • భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు పరిశీలించిన వైసీపీ నేతలు
 • టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగింది
 • అమరావతి కోసం ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశారు
 • దత్తపుత్రుడు మాయమాటలు చెప్పి మభ్యపెడుతున్నారు
 • 30 నెలల్లో ఎయిర్ పోర్టు పూర్తి చేస్తాం : వైవీ
 • హైదరాబాద్ తో పోటీపడేలా ఉత్తరాంధ్ర అభివృద్ధి
 • ఉత్తరాంధ్ర అభివృద్ధే వైసీపీ లక్ష్యం : అమర్నాథ్

05:14 PM, Dec 16th, 2023
మీరు ఇష్టమొచ్చినట్లు పోటీ చేయొచ్చా?: మంత్రి అంబటి

 • చంద్రబాబు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు
 • సీఎం జగన్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు
 • అర్థం లేని రాజకీయ విమర్శలు చేస్తున్నారు
 • అంత అద్భుతమైన పాలనే అందించి ఉంటే ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా
 • మళ్లీ చక్కని పాలన అందిస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు?
 • వైఎస్‌ జగన్‌ సింగిల్‌గా వచ్చి 151 సీట్లు గెలిచారు
 • ఇప్పుడు మళ్ల ఈ175కి 175 గెలిచే విధంగా అడుగులేస్తున్నాం
 • పార్టీ గెలుపే ధ్యేయంగా కొన్ని సీట్ల మార్పులు జరుగుతున్నాయ్‌
 • ఇప్పుడు 175 సీట్లు గెలవడమే మా టార్గెట్‌
 • మా సంక్షేమ పథకాలు ఫలాలు ప్రజలకు చేరాయి
 • 60 శాతంపైగా  ప్రజలు జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు
 • చంద్రబాబు కాంగ్రెస్‌లో అరంగేట్రం చేశారు
 • చంద్రబాబు అసలు కుప్పంలో పోటీ చేస్తారా?
 • లోకేష్‌ను మంగళగిరిలో పోటీకి నిలపడం మార్పు కాదా?
 • పురంధేశ్వరి నియోజకవర్గం ఎక్కడో చెప్పగలారా?
 • మీరు ఇష్టమొచ్చిన చోట పోట చేయొచ్చా?
 • చంద్రగిరి, మంగళగిరిలో మీకు మిగిలేది శంకరిగిరిమాన్యాలే!
 • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను పల్లకి మోసేవాళ్లుగానే టీడీపీ చూస్తోంది
 • వచ్చే ఎ‍్ననికల్లో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయం
 •  కరోనా సమయంలోనూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాం 
 •  చంద్రబాబు ఏ రోజైనా ప్రభుత్వ  స్కూళ్లను పట్టించుకున్నారా 
 •  చంద్రబాబు ప్రైవేట్ స్కూళ్లకు రాచబాట వేశారు 
 •  ఒక్కసారి అయినా పేదలకు ఇళ్ల పట్టాలిచ్చావా 
 •  30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన నాయకుడు జగన్ 
 •  టీడీపీ దిగజారిపోయిన పార్టీ 
 •  లోకేష్ యువగళం అంతా ఒక కామెడీ షో 
 •  యువగళం పేరుతో తిరిగిన లోకేష్ నాయకుడిగా ఎదిగాడా ?
 •  యువగళం యాత్ర అట్టర్ ప్లాప్ అయింది 
 •  పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ఎన్ని సీట్లు ముష్టి వేయాలనుకుంటున్నారు  
 •  పవన్ ఎన్ని సీట్లు తీసుకోవాలనుకుంటున్నారు 
 •  మోదీని విమర్శించిన చంద్రబాబు మళ్లీ బీజేపీ తో కలుద్దామనుకుంటున్నారు 
 •  పవన్ పదేళ్లకు కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారా ? 
 •  పోలవరం ప్రాజెక్ట్ ను నాశనం చేసింది చంద్రబాబు 
 •  అంకెల గారెడీతో ప్రజలను మోసం చేస్తున్నారు 
 •  వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబుకు రిటైర్మెంట్ ఖాయం


04:56 PM, Dec 16th, 2023
రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు: మంత్రి కారుమూరి ఫైర్‌ 

 • తణుకు మినిస్టర్‌ క్యాంపు కార్యాలయంలో కారుమూరి మీడియా సమావేశం 
 • ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి ఫైర్‌
 • బాబుకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదు
 • ఆనాడు ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అంది బాబే 
 • హోదా అంశాన్ని అటకెక్కించిన బాబు 
 • పోలవరం పూర్తికాని పాపం కూడా బాబుదే 
 • పోలవరంలో ఏమీ చేయకుండా అంతా చేసేశానంటూ బాబు బిల్డప్‌
 • మనుషుల్ని తీసుకెళ్లి మరీ భజన చేయించుకున్న బాబు
 • జాబ్‌ క్యాలెండర్‌ ఊసెత్తే అర్హత బాబుకి లేదు
 • మా ప్రభుత్వంలో సచివాలయం రూపేణా లక్షల్లో ఉద్యోగాలిచ్చాం
 • చంద్రబాబు హయంలో 11.8 శాతం పేదరికం
 • పేదరికాన్ని 6 శాతానికి తగ్గించిన  ఘనత జగన్ మోహన్ రెడ్డిది  
 • బాబు హయాంలో 17వ స్థానంలో విద్యావ్యవస్థ 
 • జగనన్న విప్లవాత్మక మార్పులతో ఇప్పుడు మూడో స్థానంలో 
 • రెండకరాల రైతువి.. లక్ష కోట్లు ఎలా సంపాదించావు? 
 • రాష్ట్రానికి పట్టిన శని ఏదైనా ఉందంటే అది చంద్ర బాబే  

03:58 PM, Dec 16th, 2023
నంద్యాలలో టీడీపీకి షాక్‌

 • నంద్యాల టీడీపీలో బయటపడ్డ విబేధాలు
 • అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మనందరెడ్డి డుమ్మా
 • బుజ్జ గించడానికి ప్రయత్నించిన టీడీపీ నేతలు
 • అయినా సమావేశానికి రాని బ్రహ్మానందరెడ్డి

03:40 PM, Dec 16th, 2023
ఆంధ్రప్రదేశ్‌లో ఇలా.. తెలంగాణలో అలా.. !

ఏలూరు జిల్లా : 2024 ఎన్నికల్లో మా పొత్తు జనసేనతోనే : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ

 • అమ్మా.. పురందేశ్వరీ..! ఒక సారి మీ తెలంగాణ పార్టీ నేతలతో మాట్లాడండి.
 • అక్కడ తెలంగాణ ఎన్నికల సందర్భంగా పవన్‌ కళ్యాన్‌ ఇచ్చిన షాక్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు
 • మాకొద్దీ పవన్‌ కళ్యాణ్‌.. సింగిల్‌గానే లోక్‌సభ ఎన్నికలకు వెళ్తామని కిషన్‌రెడ్డి నిన్ననే ప్రకటించారు
 • తెలంగాణలో పొత్తులో భాగంగా జనసేనను మీరు కలుపుకున్నందుకు మీకొచ్చిన ఓట్ల లెక్క ఒకసారి చూడండి
 • అసలు పవన్‌ కళ్యాణ్‌ చివరిదాకా కనీసం ప్రచారానికైనా వచ్చాడా?

సరే.. అయినా మీరు జనసేనతోనే వెళ్లాలనుకుంటున్నారా?

 • కనీసం పవన్‌ కళ్యాణ్‌ అయినా.. మీ మాట వింటున్నాడా?
 • మీ మరిది చంద్రబాబుతో జైల్లో చర్చలు జరిపి.. బయటకు వచ్చి పవన్‌ ప్రకటన చేసినప్పుడు ఎటు పోయింది మీ పొత్తు?
 • పవన్‌ కళ్యాణ్‌ మీతో పొత్తులో ఉన్నాడని మీరంటున్నారు.. తానేమో.. చంద్రబాబుతో  తిరుగుతున్నాడు.!
 • ఇంతకీ పవన్‌ మీ వైపు ఉన్నాడా? బాబు వైపు జంప్‌ చేశాడా?
 • లేక మీరే చంద్రబాబు వైపునకు పవన్‌కళ్యాణ్‌ను పంపారా?
 • మీ తాపత్రయం బీజేపీ గెలవాలనా? లేక చంద్రబాబుకు మేలు జరగాలనా?

03:20 PM, Dec 16th, 2023
మ్యానిఫెస్టో ఇంకా కొలిక్కి రాలేదట.!

 • విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం
 • అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం
 • యువగళం ముగింపు సభ ఏర్పట్లపై సమీక్ష
 • పోలిపల్లిలో ఈనెల 20న యువగళం ముగింపు సభ
 • ఎన్నికల శంఖారావం పూరించే సభగా తీసుకుంటున్నాం : అచ్చెన్నాయుడు
 • సభకు భారీగా జనసమీకరణ చేస్తున్నాం
 • మేనిఫెస్టో విడుదల అనుకున్నాంగానీ.. ఇది యువగళం సభ మాత్రమే
 • త్వరలో చంద్రబాబు- పవన్ కలయికతో సభ నిర్వహిస్తాం
 • అప్పుడు చంద్రబాబు- పవన్ కలిసి మేనిఫెస్టో ప్రకటిస్తారు : అచ్చెన్నాయుడు

03:10 PM, Dec 16th, 2023
ముగింపుకు ఆత్రుత పడుతోన్న లోకేష్‌

 • నడిచింది చాలు, యువగళం ముగిద్దాం
 • మరో నాలుగు రోజుల్లో పాదయాత్ర ముగింపు సభ
 • ఆరంభించిన నాటి నుంచి ఎన్నో అవాంతరాల మధ్య యువగళం
 • చంద్రబాబు అరెస్ట్‌ కాగానే.. పాదయాత్ర వదిలిపెట్టి ఢిల్లీ వెళ్లిపోయిన లోకేష్‌
 • ఇచ్ఛాపురం కాదు.. 200 కిలోమీటర్ల ఉత్తరాంధ్రకు ఎగనామం
 • బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతోన్న లోకేష్‌

03:04 PM, Dec 16th, 2023
ఎన్నికల మోడ్‌లోకి వైఎస్సార్‌సిపి

 • స్పీడ్‌ పెంచిన YSRCP అధ్యక్షుడు, ముఖ్యమంత్రి YS జగన్‌
 • ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలకు ధీటుగా జవాబిస్తోన్న సీఎం జగన్‌
 • చేసిన అభివృద్ధి, సంక్షేమంపై సీఎం జగన్‌ సాధికారికంగా ప్రసంగాలు
 • పార్టీ అభ్యర్థులు, టికెట్ల విషయంలో ధైర్యంగా నిర్ణయాలు
 • కార్యకర్తలు, పార్టీలో స్పూర్తి నింపుతూ ప్రయాణం
 • మెరుగైన పాలనే మార్గం, గెలుపొక్కటే లక్ష్యం
 • చంద్రబాబు రూపంలో రాష్ట్రానికి పట్టిన చీడ, పీడ పోవాలంటూ పిలుపు

2:40 PM, Dec 16th, 2023
వైఎస్సార్‌ మా గుండెల్లో నాయకుడు : మజ్లిస్‌

 • తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన మజ్లిస్‌ నాయకుడు అక్బరుద్ధిన్‌
 • రెండు తెలుగు రాష్ట్రాలలో ముస్లింలకు వైయస్సార్ చేసిన కృషి మరువలేనిది
 • ముస్లింలు ఎవరు, ఏ సమస్య కోసం వచ్చినా పరిష్కారం చూపించారు
 • నాడు వైఎస్సార్‌ సారథ్యంలోని ప్రభుత్వం ముస్లింలకు ఎంతో చేసింది
 • అన్ని వర్గాలకు మేలు చేసిన నాయకుడు YSR
 • నాడు వైఎస్సార్‌ చేశాడు కాబట్టే.. ఇవ్వాళ కాంగ్రెస్‌ పట్ల అభిమానం ఉంది : అక్బరుద్దీన్

2:15 PM, Dec 16th, 2023
బాబ్బాబు.. మమ్మల్ని కాస్తా నమ్మండి

 • ముస్లింలను నేను మైనారిటీ ఓట్ బ్యాంకుగా చూడను : పవన్‌ కళ్యాణ్‌
 • ముస్లింలూ.. ఒక్కసారి జనసేనను నమ్మండి! : పవన్‌ కళ్యాణ్‌
 • మిమ్మల్ని మీ సామాజికవర్గమే నమ్మట్లేదు.. మిగతా వాళ్లెలా నమ్ముతారు? : ముస్లింల ప్రశ్న


13:55 PM, Dec 16th, 2023
చంద్రబాబుపై హాట్‌ కామెంట్స్‌

 • టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యలు
 • పదవి కోసం చంద్రబాబు ఎవరి కాళ్లైనా పట్టుకుంటాడు
 • చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ ఏ విధంగా పనికొస్తాడో అర్థం కావడం లేదు
 • పవన్‌, దగ్గుబాటి పురందేశ్వరి ఇద్దరూ చంద్రబాబు కోవర్టులు
 • ఎల్లో మీడియా రాతలు అభివృద్ధిని నిరోధించే తూట్లు
 • అభివృద్ధికి అడ్డుపడుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లను చదవొద్దని ఏపీ ప్రజలకు డిప్యూటీ సీఎం విజ్ఞప్తి


13:36 PM, Dec 16th, 2023
నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు: రాప్తాడు ఎమ్మెల్యే

 • రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై యెల్లో మీడియా దుష్ప్రచారం
 • ఖండించిన ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి 
 • నా మాటల్ని ఓ వర్గం మీడియా వక్రీకరించింది
 • రాప్తాడు నియోజకవర్గానికి ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నాను 
 • ఆ వ్యాఖ్యల్ని సరిగా అర్థం చేసుకోలేదు
 • రాప్తాడు నియోజకవర్గంలోని రహదారుల కాంట్రాక్టు టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత దక్కించుకున్నారు 
 • 33 రహదారుల పనులను చేయకుండా పరిటాల సునీత నిర్లక్ష్యం చేస్తున్నారు
 • పరిటాల సునీతకు వ్యతిరేకంగా ధర్నాలు చేయాల్సి ఉంది 

12:45 PM, Dec 16th, 2023
విద్యార్థులకు టాబ్లెట్‌లు ఇస్తే మీకెందుకు కడుపుమంట : తానేటి వనిత

 • పశ్చిమ గోదావరి జిల్లాలో మాట్లాడిన హోం మంత్రి తానేటి వనిత
 • 8వతరగతి విద్యార్థులకు.. విద్యకు ఉపయోగపడేలా ట్యాబ్‌లు ప్రభుత్వం ఇచ్చింది
 • ఎలాంటి డైవర్షన్‌ వీడియోలు చూసేందుకు వీలు లేకుండా  ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది
 • ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం చేస్తున్న మంచిని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు
 • అంతకు ముందు ఇంగ్లీష్ మీడియం చదువు పై కూడా కావాలని కోర్టులకు వెళ్లారు
 • ఈ విషయంలో ఎల్లో మీడియా చేస్తోన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం
 • ట్యాబ్ లతో వాళ్ల మనవళ్ళు చదువుతున్నప్పుడు పేద విద్యార్థులు చదువుకోకూడదా?
 •  ఉచితంగా ఇచ్చిన ట్యాబ్‌లతో నాలెడ్జ్ పొందుతున్నామని విద్యార్థులు అంటున్నారు
 • పిల్లల చదువులపై కూడా రాజకీయం చేస్తున్నారా?
 • తల్లిదండ్రులను పెడదోవ పట్టించడానికి పిల్లలను భయభ్రాంతులు చేయాలని చూస్తున్నారు
 •  ఎన్నికల్లో ఎదుర్కొనే సత్తా ఉంటే రాజకీయంగా రావాలి....
 • ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకోలేని మీరు విద్యార్థుల ట్యాబ్ల గురించి మాట్లాడుతున్నారు...
 • ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్నాను....
 • చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉండి ఏమి చేశారు?
 • విద్యార్థుల చదువు గురించి ఏనాడైనా ఆలోచించారా....?
 • అమ్మ ఒడి పథకం ఎందుకు పెట్టలేకపోయారు......
 • ఒక పథకాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చినప్పుడు దాని మైలేజ్ ని చెడగొట్టాలని చూస్తున్నారు...
 • బురద చల్లి రాళ్లు వేద్దామని చూసేవారే కానీ మంచిని మంచి అని చూపే ప్రతిపక్షాలు రాష్ట్రంలో లేవు

12:10 PM, Dec 16th, 2023
చంద్రబాబు ఇంకా భ్రమల్లోనే ఉన్నారు : మల్లాది విష్ణు

 • విజయవాడ : రాష్ట్ర ప్రజలు 2019లో చంద్రబాబుపై తిరుగుబాటు చేసి ఓడించినా బుద్ధి రాలేదు
 • నిన్న తెలుగుదేశం సమావేశంలో పది అంశాలకు మీరే సమాధానం చెప్పాలి
 • ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీ కింద మార్చింది చంద్రబాబే
 • విభజన చట్ట ప్రకారం పోలవరం కేంద్రమే కట్టాలి... దాన్ని కూడా నీ తొత్తులకు కట్టబెట్టావు బాబు..!
 • పోలవరం వద్దకు భజనలు చేసేందుకు వెళ్తే రూ. 200 కోట్లు ప్రభుత్వం కట్టింది
 • ఇసుక మాఫియా కుంభకోణం జరిగింది చంద్రబాబు ప్రభుత్వం లోనే
 • చంద్రబాబు గురించి గతంలో ఈనాడు పత్రిక 2 పేజీలు రాసింది
 • రాష్ట్ర ప్రజలు చంద్రబాబును 23 సీట్లకు పరిమితం చేసినా బుద్ధి రాలేదు
 • తెలుగుదేశం పార్టీ నేతలు కళ్ళు తెరుచుకుని మాట్లాడాలి.

11:01AM, Dec 16th, 2023
టీడీపీ ‘దొంగ ఓట్లు’ బాటలోనే జనసేన నేతలు

 • ఏపీలో దొంగ ఓట్ల చేరికలో జనసేన భారీ కుట్ర
 • తెలంగాణలో ఓటు ఉండగా ఏపీలో కూడా ఓటు కోసం దరఖాస్తులు
 • మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం నాగబాబు దరఖాస్తు
 • ఏపీలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న నాగబాబు
 • ఫారం-6తో దరఖాస్తు చేసుకున్న జనసేన నేత నాగబాబు
 • ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన నాగబాబు

10:30AM, Dec 16th, 2023
ధనిక విద్యార్థులకే ట్యాబ్స్‌ ఉండాలా?: ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి

 • ఈనాడు రాసిన తప్పుడు వార్తలను ఖండించిన ఎమ్మెల్యే పార్థసారథి
 • విద్యార్థులకు ఇచ్చిన బైజుస్ ట్యాబ్ పై ఈనాడు విషప్రచారం.
 • విద్యార్థుల పరిజ్ఞానం పెంచేందుకు ట్యాబ్స్ ఇచ్చాం.
 • పేద విద్యార్థుల జీవితాల్లో మార్పు కోసం సీఎం కృషి చేస్తున్నారు.
 • ధనిక విద్యార్థులకే ట్యాబ్స్ ఉండాలా?
 • పేద విద్యార్థులకు ఉండకూడదా.
 • అహంకార ధోరణితో కదనాలు ప్రచురిస్తున్నారు.
 • ఉపాధ్యాయులు అనునిత్యం ట్యాబ్స్ పరిశీలిస్తున్నారు.
 • ఇతర సైట్లు ఇన్స్టాల్ అవ్వకుండా లాక్ సిస్టం ఏర్పాటు చేశాం.
 • విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారు.

ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలి: సీఎం జగన్‌

 • ఎన్నికలు ఎప్పుడు జరిగినా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలి
 • మంత్రులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం 
 • ఈసారి సార్వత్రిక ఎన్నికలకు కాస్త ముందే షెడ్యూలు రావచ్చు
 • ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి ఉధృతంగా వెళ్లండి 
 • గత నాలుగున్నరేళ్లుగా మనం చేసిన మంచిని ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించండి 
 • 175 స్థానాల్లోనూ విజయమే మన లక్ష్యం
 • ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఈనెల 21 నుంచి ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు సమన్వయం చేసుకుంటూ విస్తృతంగా పాల్గొనాలి
 •  వృద్ధాప్య పింఛన్‌ రూ.2,000 వేల నుంచి రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. జనవరి 1 నుంచి రూ.3 వేలకు పెంచి పంపిణీ చేసే కార్యక్రమాన్ని జనవరి 8 వరకూ నిర్వహిస్తాం
 • అందులో విస్తృతంగా పాల్గొనాలి
 • జనవరి 10 నుంచి 23 వరకూ  వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత కింద మహిళా సంఘాలకు నిధుల జమ కార్యక్రమం
 • జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకూ వైఎస్సార్‌ చేయూత పథకం కింద మహిళల ఖాతాల్లో నిధుల  జమ  కార్యక్రమం
 • వరుస కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలి

10:00AM, Dec 16th, 2023
175 స్థానాల్లోనూ విజయమే మన లక్ష్యం: ప్రభుత్వ సలహాదారు సజ్జల

 • 175 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం ఖాయం
 • ఇప్పటినుంచే ఓటమికి సాకులు వెదుక్కుంటున్న చంద్రబాబు 
 • అందుకే ఎల్లో మీడియాతో ప్రభుత్వంపై బురదజల్లుతూ అభూతకల్పనలతో కథనాలు రాయిస్తున్న బాబు  
 • తాంత్రికపూజలపై నమ్మకంతోనే అధికారంలోకి వస్తానని  చంద్రబాబు కలలుకంటున్నాడేమో! 
 • ఉద్దానం సమస్యపై నాడు కోతలు కోసి.. నేడు సీఎం జగన్‌ పరిష్కరిస్తే నోరుమెదపని బాబు, పవన్‌  
 • వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలను మారిస్తే చంద్రబాబుకు నొప్పేంటి?  
 • వైఎస్సార్‌సీపీలో ఎమ్మెల్యే పదవులు, పార్టీ పదవులు రెండు సమానమే 
 • చంద్రగిరి నుంచి బీసీ స్థానమైన కుప్పానికి వలస ఎందుకు వెళ్లావ్‌ బాబూ?  
 • బీసీ స్థానమైన మంగళగిరిలో పోటీచేయడానికి లోకేశ్‌కు సిగ్గుండాలి

09:30AM, Dec 16th, 2023
పవన్‌ కళ్యాణ్‌పై నమోదైన కేసులో విచారణ ఈ నెల 22కు వాయిదా

 • ఏపీలోని వలంటీర్లపై పవన్‌ కళ్యాణ్‌ చేసిస అవమానకర వ్యాఖ్యలపై కేసు నమోదు
 • పవన్‌ వ్యాఖ్యల కేసులో ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలు నమోదు
 • ఏపీలోని వలంటీర్లపై పవన్‌ కళ్యాణ్‌ చేసిస అవమానకర వ్యాఖ్యలపై  విజయవాడ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ న్యాయస్థానంలో విచారణ

09:00AM, Dec 16th, 2023

చంద్రగిరి నుంచి కుప్పంకు ఎందుకు బదిలీ అయ్యావ్‌: మాజీ మంత్రి పేర్ని నాని

 • మా ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకున్నావ్‌ 
 • పవన్‌కళ్యాణ్‌ తన పార్టీని చంద్రబాబుకు లాంగ్‌లీజుకు ఇచ్చాడు 
 •  తెలంగాణలో జీవనం.. ఆంధ్రాలో రాజకీయం  
 • సీటు రాకపోయినా పార్టీ కోసం పనిచేస్తా 
 • మా కుటుంబమంతా సీఎం జగన్‌ మేలు కోసమే  

08:30AM, Dec 16th, 2023

వైఎస్సార్‌సీపీలోకి చేరిన పలమనేరు టీడీపీ నేత

 • వైఎస్సార్‌సీలోకి టీడీపీ నేత ఆర్‌వీ సుభాష్‌ చంద్రబోస్‌
 • సీఎం జగన్‌ సమక్షంలో చేరిక
 • 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పలమనేరు నుంచి పోటీ చేసిన చంద్రబోస్‌

08:00AM, Dec 16th, 2023

పేదల నాడి తెలిసిన నాయకుడు మనం సీఎం జగన్‌: హోంమంత్రి తానేటి వనిత

 • రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు
 • విజయవాడ తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి సీఎం జగన్‌ కృషి
 • టీడీపీ నాయకులు ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోలేదు
 • స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితం

Advertisement
 

తప్పక చదవండి

Advertisement