ఏపీలో చంద్రబాబు సర్కార్ అరాచక పర్వం కొనసాగుతోంది. బరిలో దిగి ఓటర్ల తీర్పును స్వాగతించే ధైర్యం లేక.. కూటమి శ్రేణులు ‘దుశ్శాసనపర్వానికి’ తెరలేపాయి. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో నిన్న (శనివారం) టీడీపీ గూండాల భౌతిక దాడులతో భీతావహ వాతావరణం నెలకొంది. ఇవాళ(ఆదివారం) కూడా దాష్టీకం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ ఆఫీస్ చుట్టూ ముళ్ల కంచెలు వేసిన పోలీసులు.. పలువురు వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
Updates:
నామినేషన్లు అడ్డుకోవాలని టీడీపీ, పోలీసుల ప్లాన్
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని టీడీపీ, పోలీసుల ప్లాన్
వైఎస్సార్సీపీ ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు
పులివెందుల నియోజక వర్గం నుండి వైసీపీ కార్యకర్తలు పులివెందుల టౌన్ కి వస్తె కేసులు పెడతామని భయపెడుతున్న పోలీసులు
నిన్న పులివెందులలో వైసీపీ కార్యకర్తలపై పోలీసుల దాడి..
నిన్న దాడికి సంబంధించి పులివెందుల డీఎస్పీ , టీడీపీ నేత బిటెక్ రవి అర్ధరాత్రి రహస్య సమావేశం
వైఎస్సార్సీపీ నేతల పై కేసులకు పెట్టాలని డీఎస్పీకీ సూచించిన టీడీపీ నేత బీటెక్ రవి
వైఎస్సార్సీపీ నేతలకు ఆంక్షలు పెడుతున్న పోలీసులు
వైఎస్సార్సీపీ నేతలపై దాడికి ఇతర ప్రాంతాల నుండి గూండాలను తరలిస్తున్నారు
పోలీసులే టీడీపీ గుండాలకు రక్షణ కల్పిస్తున్నారు
పోలీసుల చొరవతోనే పులివెందులకు వస్తున్న టీడీపీ గుండాలు
పులివెందులలో కొనసాగుతున్న పోలీసుల దాష్టీకం
- వైఎస్సార్సీపీ ఆఫీస్ చుట్టూ ముళ్ల కంచెలు వేసిన పోలీసులు
- పలువురు వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
- నామినేషన్లు వేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నం
పులివెందులో మరోసారి ఉద్రిక్తత
పులివెందుల వైఎస్సార్సీపీ ఆఫీస్‌కు ఎంపీ అవినాష్‌రెడ్డి
వైఎస్సార్సీపీ ఆఫీస్ చుట్టూ ముళ్లకంచెలు వేసిన పోలీసులు
నామినేషన్లు వేయడానికి వెళ్లకుండా అడ్డుకోవాలని ప్రయత్నం
ముళ్లకంచెలు ఎలా వేస్తారని పోలీసులు కార్యకర్తల వాగ్వాదం
పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆందోళన
వైఎస్సార్సీపీ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశం
హైకోర్టును ఆశ్రయించిన కడప వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి
తమను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని పిటిషన్
నామినేషన్ వేసేలా పోలీస్ భద్రత కల్పించాలన్న హైకోర్టు
బెదిరింపులు.. హెచ్చరికలు
జంగిల్‌రాజ్ పాలనలో రెండోరోజు(శనివారం) కొనసాగిన అరాచకం
రాష్ట్ర వ్యాప్తంగా భౌతిక దాడులకు దిగిన పచ్చ మూకలు
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తీవ్ర ఉద్రిక్తతలు
వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు
కత్తులు, వేట కొడవళ్లు, రాడ్లు, కర్రలతో రెచ్చిపోయిన ఎల్లో రౌడీలు
పులివెందులలో పోలీసుల సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ
వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అడ్డగింత
కడప జిల్లాలో ముఖ్య నేతల నిర్బంధం.. నామినేషన్ పత్రాలు చింపివేత
పల్నాడు జిల్లా గురజాల, పిడుగురాళ్లలో అభ్యర్థులను అర్ధరాత్రి ఎత్తుకెళ్లిన పోలీసులు
తిరుపతిలో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయిని అడ్డుకున్న పోలీసులు
మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, భూమన అభినయ్‌రెడ్డిలపై అక్రమ కేసు
పోలీసులను అడ్డుపెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా బెదిరింపులు.. హెచ్చరికలు


