టీడీపీ నుంచి వచ్చిన వంగవీటి రాధాకు విజయవాడ మేయర్ సీటు
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను జనసేన పార్టీ శనివారం ప్రకటించింది. విజయవాడ మేయర్ అభ్యర్థిత్వాన్ని చివరి నిమిషంలో టీడీపీ నుంచి జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణకు, ఏలూరు మేయర్ స్థానాన్ని రెడ్డి అప్పలనాయుడుకు కట్టబెట్టారు. జనసేనకు నాలుగు మేయర్ స్థానాలు కేటాయించినప్పటికీ.. ప్రస్తుతం రెండుచోట్ల మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. 106 మున్సిపాలిటీలకు గాను ప్రస్తుతం 87 చోట్ల ఎన్నికలు జరుగుతుండగా, కూటమిలో జనసేనకు కేవలం 21 సీట్లే కేటాయించారు. అందులో 18చోట్ల మాత్రమే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండగా.. 12చోట్ల చైర్మన్ అభ్యర్థులను ప్రకటించింది. తొలివిడత మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు ఆదివారం చివరి రోజు కాగా, మరో 6చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
జనసేన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులు
నల్లాశ్రీధర్ (అమలాపురం), తోట రాజరాజేశ్వరి (చిలకలూరిపేట), కడారి తమ్మయ్యనాయుడు (గొల్ల ప్రోలు), కొత్తపల్లి శైలజ (నరసాపురం), కల్లం జ్యోతి (నిడదవోలు), బళ్లాజ్ఞానలింగ జ్యోతి (పెడన), దానం లాజర్బాబు (పిఠాపురం), డి.ఏలుమలై (పుత్తూరు), గొర్లె విజయకుమారి (సాలూరు), పిట్టా జానకి రామారావు (సామర్లకోట), తోటకూర వెంకట రమణారావు (తెనాలి), పి.మాధవి (తిరువూరు), దారం సుబ్బారావు(దర్శి), మేకల ఈశ్వర్ (పుట్టపర్తి), పల్లా విజయనిర్మల (పాలకొండ), ఎస్.శ్రీనివాసరావు(మడకశిర).


