ఏపీలో పోలింగ్‌ శాతం పెరిగింది: ఏపీ సీఈవో | Ap Ceo Mukesh Kumar Meena Press Meet On Voting | Sakshi
Sakshi News home page

ఏపీలో పోలింగ్‌ శాతం పెరిగింది: ఏపీ సీఈవో

May 13 2024 7:55 PM | Updated on May 15 2024 12:37 PM

Ap Ceo Mukesh Kumar Meena Press Meet On Voting

ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్దసంఖ్యలో పోలింగ్‌ నమోదైందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు.

సాక్షి, విజయవాడ: ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్దసంఖ్యలో పోలింగ్‌ నమోదైందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశామని చెప్పారు.

పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయి. పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈవీఎంలోని చిప్‌లో డేటా భద్రంగా ఉంది. ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్‌ ప్రారంభించాం. కొన్ని చోట్ల ఇంకా పోలింగ్‌ కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడ మిషన్లు మార్చి పోలింగ్‌ పునరుద్ధరించాం. పల్నాడు, అనంతపురం, తెనాలిలో కొందరిని గృహ నిర్బంధం చేశారు’’ అని ఏపీ సీఈవో వెల్లడించారు.

11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఎక్కడా రీ పొలింగ్‌ అవసరం పడలేదు. కొన్ని ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం. ఇప్పటివరకు 75 శాతం పోలింగ్‌ నమోదైంది. స్ట్రాంగ్‌ రూమ్‌లోకి ఈవీఎంల తరలింపు జరుగుతుందని ఎంకే మీనా వెల్లడించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement