కబ్జాలను అడ్డుకుంటే కక్ష సాధింపా?

Ambati Rambabu Fires On TDP about Visakha Land Scam - Sakshi

చంద్రబాబు హయాంలోనే విలువైన విశాఖ భూములు స్వాహా: అంబటి

సాక్షి, అమరావతి: కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు ప్ర యత్నిస్తుంటే కక్ష సాధింపు చర్య అంటూ టీడీపీ గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. విశాఖలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకోలేదని చెప్పే దమ్ము, ధైర్యం టీడీపీకి ఉందా? అని  ప్రశ్నిం చారు. చంద్రబాబు పాలనలో రూ.వేలకోట్ల విలువై న భూములను కాజేశారన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మంగళవారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలకు చెందిన గీతం సంస్థ, తాజాగా పల్లా శ్రీనివాసరావు ప్రభుత్వ భూములను ఆక్రమించుకో లేదని టీడీపీ చెప్పగలదా? అని ప్రశ్నించారు. అంబటి ఇంకా ఏమన్నారంటే..

కబ్జా నిజమని మీ మంత్రే చెప్పలేదా?
టీడీపీ హయాంలోనే వారు నమ్మే ఓ పత్రిక విశాఖ భూ కుంభకోణంపై అనేక కథనాలు వెలువరించింది. నాడు చంద్రబాబు హయాంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు దీనిపై స్పందిస్తూ... ‘విశాఖలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల అండదండలతో భూదందా యథేచ్ఛగా సాగుతోంది. భూ బకాసురులు విచ్చలవిడిగా ఆక్రమిస్తున్నారు. భూ దోపిడీదారులను తన్నడానికి విశాఖ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మంత్రి పదవినైనా వదులుకోడానికి సిద్ధపడే ఈ నిజాన్ని నిర్భయంగా చెబుతున్నా’ అని ప్రకటించారు. 379 గ్రామాలకు సంబంధించిన భూ రికార్డులు గల్లంతయ్యాయని అప్పుడు జిల్లా కలెక్టరే చెప్పారు. వాళ్ల ప్రభుత్వంలో వారే లక్ష ఎకరాలకు సంబంధించిన ఎఫ్‌ఎంబీలు గల్లంతు చేశారు. ఇది టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న వ్యక్తే చెప్పారు.

విశాఖను కాజేసిన చంద్రబాబు
విశాఖలో భీమిలి, హైవే పక్కన, కసింకోట, గాజువాక, ఎస్‌.రాయవరం ప్రాంతాల్లో వక్ఫ్‌ భూములను కాజేసిన చరిత్ర టీడీపీదే. పెందుర్తి, ఆనందపురం, భీమిలి ప్రాంతాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో కబ్జాకు స్కెచ్‌ వేశారు. ఆ భూములు తమవి కావని శ్రీనివాస్‌ చెబుతుంటే చంద్రబాబుకు బాధ ఎందుకు? గతేడాదిగా 250 భూ ఆక్రమణల పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపి దాదాపు 430.80 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.4,291 కోట్లు. టీడీపీ నేత శ్రీనివాస్‌ ఆక్రమణల విలువ రూ.791 కోట్లు. మొత్తం కలిపి రూ.5,082 కోట్ల విలువైన భూములను కాపాడి వెలికితీశారు. విశాఖ కబ్జా నగరంగా ఉండాలా? లేక మహానగరంగా తీర్చిదిద్దాలో చంద్రబాబు జవాబు చెప్పాలి.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top