అర్హులందరికీ ‘చేయూత’ | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ‘చేయూత’

Nov 14 2026 12:17 AM | Updated on Nov 14 2026 12:17 AM

ఎలిగేడు: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రజాప్రభుత్వంలో అర్హులందరికీ చేయూత పింఛన్లు అందిస్తున్నామని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎ మ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఎలిగేడు, జూలపల్లి మండలాలకు చెందిన కొత్త చేయూత పింఛన్‌దారులకు శుక్రవారం ధూళికట్టలో మంజూరు పత్రాలు పంపిణీ చేసి మాట్లాడారు. జిల్లాలో 11 వేలపైచిలుకు నూతన పింఛన్లు మంజూరయ్యాయని, అందులో పెద్దపల్లి నియోజకవర్గంలో 5,124 మంది ఉన్నారని తెలిపారు. ఈనెల 19న లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్‌ డబ్బు జమ అవుతుందని అన్నారు. ఎల్‌నినోతో యాసంగిలో భూగర్భజలాలు అడుగంటి పోయే ప్రమాదం ఉందని, రైతులు ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని సూచించారు. డీఆర్డీవో కాళిందిని, ఎలిగేడు, జూలపల్లి ఎంపీడీవోలు భాస్కర్‌రావు, పద్మజా, ఎంపీవో కిరణ్‌, ఎలిగేడు సింగిల్‌విండో చైర్మన్‌ సామ రాజేశ్వర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పొట్యాల రమేశ్‌, వైస్‌ చైర్మన్‌ కోరుకంటి వెంకటేశ్వర్‌రావు, సర్పంచులు కొమురయ్య, ప్రవీణ్‌, వెంకటేశ్‌గౌడ్‌, వెంకట్‌రెడ్డి, బాపయ్య, రజిత, లత, రమాదేవి, శైలజ, వాణి, రాధ గంగా జమున, తిరుపతియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

సుల్తానాబాద్‌ పట్టణ అభివృద్ధికి కృషి

సుల్తానాబాద్‌రూరల్‌: సుల్తానాబాద్‌ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నాని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నారు. మున్సిపల్‌లోని ఏడో వార్డులో చేపట్టిన యాదవ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి శంకస్థాపన చేసి మాట్లాడారు. సబ్‌ సెంటర్లు, రోడ్లు, డ్రైనేజీల కోసం ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నామని తెలిపారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాథాకృష్ణ, జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, ఏఎంసీ చైర్మన్‌ ప్రకాశ్‌రావు, కమిషనర్‌ రమేశ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పుష్పలత, కౌన్సిలర్లు వరప్రదీప్‌, భాకం సాయికిరణ్‌, గాజుల రాయమల్లు, ప్రభాకర్‌, చింతల రాజు, సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయకులు పల్లా సురేశ్‌, రవీందర్‌, రాజలింగు, భూమయ్య, అల్లంకి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

ధూళికట్టలో లబ్ధిదారులకు పింఛన్‌ మంజూరు పత్రాలు పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement