అమ్మ లేని లోటు తీర్చిన ఉపాధ్యాయులు | - | Sakshi
Sakshi News home page

అమ్మ లేని లోటు తీర్చిన ఉపాధ్యాయులు

Nov 14 2026 12:17 AM | Updated on Nov 14 2026 12:17 AM

తల్లిని కోల్పోయిన ఆ చిన్నారికి పుట్టినరోజు ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలనుకున్నారు ఆ ఉపాధ్యాయులు. అమ్మలేని లోటును కొంతైనా మరిపిస్తూ, తోటి విద్యార్థుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించి ఆ చిన్నారి ముఖంలో చిరునవ్వులు పూయించారు. కాల్వ శ్రీరాంపూర్‌ మండలం పందిళ్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న పోతరవేన శాన్విక పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఏడాది క్రితం శాన్విక తల్లి మృతి చెందడంతో చిన్నారికి అండగా నిలవాలనే ఆలోచనతో ఉపాధ్యాయులు ఈ వేడుక ఏర్పాటు చేశారు. తోటి విద్యార్థుల మధ్య శాన్వికతో పుట్టినరోజు కేక్‌ కట్‌ చేయించి, మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో శాన్విక తండ్రి సంపత్‌, ఉపసర్పంచ్‌ ధర్ముల రవి, ఉపాధ్యాయులు వేణు, కోమల, విద్యార్థులు పాల్గొన్నారు.

– కాల్వశ్రీరాంపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement