కాళేశ్వరంతో అప్పుల భారం | - | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంతో అప్పుల భారం

Nov 14 2026 12:17 AM | Updated on Nov 14 2026 12:17 AM

ధర్మారం: కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్‌ఎస్‌ నా యకులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని వంశీకృష్ణ ఆరోపించారు. నర్సింగపూర్‌లో రూ.12 లక్షలతో సీసీ రోడ్లు, ఎర్రగుంటపల్లి దుర్గామాత ఆలయంలో రూ.5 లక్షలతో రీడింగ్‌ హాల్‌, ధర్మారంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఎంపీ మాట్లాడుతూ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించి ఉంటే ఉత్తర తెలంగాణలో సాగునీటి సమస్యలు తీవ్రంగా ఉండేది కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పటిష్టంగా ఉందని కేసీఆర్‌, కేటీఆర్‌లకు నమ్మకముంటే బ్యారేజీ దిగువన నిలబడి పంపులు ఆన్‌ చేయాలని సవాల్‌ విసిరారు. ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకే బ్యారేజీలో నీటిని నిల్వ చేయడం లేదని, ప్రజల భద్రతే ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు బ్యారేజీని వినియోగించవద్దన్న సూచనలను బీఆర్‌ఎస్‌ విస్మరిస్తోందని వంశీకృష్ణ విమర్శించారు.

రూ.120 కోట్లతో పనులు..

ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్‌ నుంచి సుమారు రూ.120 కోట్లు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎంపీ వంశీకృష్ణ తె లిపారు. ప్రజావసరాలకు అనుగుణంగా బోర్‌వె ల్స్‌, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కాడే సూర్యనారాయణ, మాజీ ఎంపీటీసీ బద్దం అజయ్‌ పాల్‌రెడ్డి, బద్దం గంగారెడ్డి, లింగారెడ్డి పాల్గొన్నారు.

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement