ఇటీవల జరిగిన ఓ పండుగ నేపథ్యంలో ఓ నేత ఓ సర్కిల్ పరిధిలోని అధికారికి పండుగ సంబంధిత ఖర్చులకు చెందిన ఇండెంట్‌ను పంపించగా సదరు అధికారి తనకు పోస్టింగ్ ఇచ్చిన కృతజ్ఞతగా చెల్లించినట్లు చర్చకు దారి తీసింది.
జిల్లాలోని ఓ సర్కిల్ పరిధిలో పోస్టింగ్ తీసుకున్న ఓ అధికారికి ఓ నేత సహాయంతో పోస్టింగ్ దక్కింది. పోస్టింగ్ చేస్తున్న క్రమంలో ఆ నేత కోసం కట్టిన ఫ్లెక్సీల కోసం కొంత మొత్తం ఇండెంట్ పంపించగా పోస్టింగ్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా దానిని చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలోని ఓ నియోజకవర్గం సర్కిల్లో ఒక అధికారికి నేతకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ఇండెంట్‌ను పంపించగా సదరు బిల్లును కృతజ్ఞతగా అధికారి చెల్లించినట్లు చర్చ జరుగుతోంది.
కరీంనగర్‌క్రైౖం: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీసు శాఖలో పోస్టింగుల వ్యవహారం కొత్త రూపు సంతరించుకుంటోందా? కోరుకున్న పోలీస్‌స్టేషన్‌లో పోస్టింగ్ పొందేందుకు గతంలో ముందస్తుగా భారీ మొత్తంలో నగదు చెల్లించేవారనే ఆరోపణలు ఉండేవి. ప్రస్తుతం నేరుగా నగదు లావాదేవీలకు బదులుగా రాజకీయ నాయకుల కార్యక్రమాలు, పర్యటనలు, పండుగలు, ఇతర అవసరాల పేరుతో అధికారుల నుంచి విడతలవారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసు వర్గాల్లో ఈ విధానాన్ని ‘ఇండెంట్ పోస్టింగులు’గా చర్చించుకుంటున్నారు.
విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి!
ముందు పోస్టింగ్.. ఆపై ఇండెంట్లు!
నెలనెలా ఖర్చుల భారం!
నిఘాకు చిక్కని పరోక్ష వ్యవహారం?
పోస్టింగుల సమయంలో నేరుగా నగదు చేతులు మారకపోవడంతో ఈ వ్యవహారం సాధారణ రాజకీయ సిఫార్సులుగానే కనిపిస్తోందనే చర్చ ఉంది. అయితే పోస్టింగ్ అనంతరం వివిధ అవసరాల పేరుతో జరుగుతున్న చెల్లింపులు పరోక్ష వసూళ్లకు మార్గంగా మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఇంటెలిజెన్స్ నిఘాకు అందకుండా సాగుతోందా? అన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కోరుకున్న స్టేషన్‌లో పోస్టింగ్.. ఆపై వసూళ్లు!
ముందస్తుకు బదులు నెలనెలా ఇండెంట్లు
‘రాజకీయ’ సిఫార్సులతో అనుకున్నచోట పోస్టింగులు
ఖర్చుల భారం అధికారులపైనే!
ఇంటెలిజెన్స్ నిఘాకు చిక్కని వ్యవహారం?
పరోక్ష వసూళ్లపై పోలీసు వర్గాల్లో చర్చ


