పెద్దపల్లిరూరల్: అప్పన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అలీషా, మెండె మారుతి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అర్హత సాధించారని పీఈటీ వేల్పుల సురేందర్ తెలిపారు. ఈనెల 14, 15వ తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే ఎస్జీఎఫ్ అండర్ –17 హ్యాండ్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే విద్యార్థులను హెచ్‌ఎం పురుషోత్తంతోపాటు ఉపాధ్యాయులు అభినందించారు.
నెట్‌బాల్ పోటీలకు ఎంపిక
సుల్తానాబాద్‌రూరల్: గర్రెపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు రుచి త, హరిణి రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపా ల్ మంజుల తెలిపా రు. గతనెల జరిగిన అండర్–19 జిల్లాస్థాయి పోటీల్లో వీరు ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు. వీరిని ప్రిన్సిపాల్, సినియర్ వైస్ ప్రిన్సిపాల్ ధనలక్ష్మీ, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ సృజన, వ్యాయమ, ఉపాధ్యాయులు అభినందించారు.
సీజన్ టికెట్లతో ప్రయోజనాలు
మంథని: ప్రయాణికులకు మరింత సౌకర్యం, ఆర్థిక వెసులుబాటు కల్పించే లక్ష్యంతో ఆర్టీసీ నెలవారీ సీజన్ టికెట్ విధానం అ మలు చేస్తోంది. ఇందులో అ నేక ప్రయోజనాలు కల్పిస్తోంది. శనివారం నుంచి ఇవి అమలులోకి వస్తాయి. నిర్దేశిత మార్గంలో దూరపరిమితి లేకుండా ప్రయాణించే అవకా శం కల్పించారు. టోల్ చార్జీలను 25 రోజులకు బదులుగా 20 రోజులకే లెక్కిస్తారు. డీల క్స్, ఈ డీలక్స్ బస్సులకూ నెలవారీ సీజన్ టికె ట్లు అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ నగరాల్లో ఆదివారాల్లో పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్ మినహా సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. పల్లెవెలుగు టికెట్ కలిగిన వారు ఎక్స్‌ప్రెస్, ఈ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ కలిగిన వారు డీలక్స్, ఈ డీలక్స్ బస్సుల్లో ఒ క్కో ప్రయాణానికి అదనంగా రూ.20 చెల్లించి ప్రయాణించవచ్చు. ఇతర మార్గాల్లో సూపర్ ల గ్జరీ, ఆపై సర్వీసుల ప్రాథమిక చార్జీలపై 10 శా తం రాయితీ కల్పించారు. మహిళలకు టోల్ చార్జీలను 20 రోజులకు బదులుగా 15 రోజు లకే లెక్కించనున్నారు. వివరాలకు 99592 25923, 90631 52130, 73828 25923 నంబర్లలో సంప్రదించాలి.
ఆర్టీసీ ఆధ్యాత్మిక యాత్ర బస్సు
గోదావరిఖనిటౌన్: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గోదావరిఖని డిపో నుంచి తొమ్మిది రోజుల ఆధ్యాత్మిక యాత్రకు ఏ ర్పాట్లు చేసినట్లు డీఎం కవిత తెలిపారు. ఈనెల 25న మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే యాత్ర డిసెంబర్ 3న ముగుస్తుందన్నారు. ఉజ్జయిని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, నాగేశ్వర్, సోమనాథ్, త్రయంబ కేశ్వర్, భీమశంకర్, ఘృష్ణేశ్వర్ ఏడు జ్యోతిర్లింగాలతో పాటు హరసిద్ధి, ప్రభాస శక్తిపీఠాలు, ద్వారకా శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుందన్నారు. శిరిడీ, శనిశింగణాపూ ర్, ఎల్లోరా గుహలనూ సందర్శిస్తారని, సూప ర్ లగ్జరీ బస్సు చార్జీ రూ.11,500, రాజధాని ఏసీ బస్సు చార్జీ రూ.14,000గా నిర్ణయించారు. భోజన, వసతి ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని, ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని ఆమె సూచించారు.
శ్రీశైలానికి ప్రత్యేక బస్సు
కార్తీకం సందర్భంగా గోదావరిఖని నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డీఎం కవిత తెలిపారు. ఈనెల 17న బయలుదేరి 19న ఉదయం గోదావరిఖనికి చేరుకుంటుందన్నారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి జ్యోతి ర్లింగం, భ్రమరాంబిక అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించుకోవచ్చని పేర్కొన్నారు. వివరాల కోసం 7013504982, 7382847596 నంబర్లను సంప్రదించాలని ఆమె కోరారు.
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
పెద్దపల్లిరూరల్: అమర్‌నగ ర్ ఫీడర్ మరమ్మతుల దృష్ట్యా శనివారం విద్యు త్ సరఫరాలో అంతరా యం కలుగుతుంది. ప్రధానంగా తెనుగువాడ, పెద్దమజీ ద్, చింతలవాడ, అమర్‌నగర్, అయ్యప్పటెంపు ల్ ఏరియా, మిషన్ హైస్కూల్, క్రిస్టియన్‌కాలనీ, కొంతంవాడ, ప్రగతినగర్‌ఏరియాల్లో ఉద యం 8 గంటల నుంచి ఉదయం 10.30 గంటల వరకు సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని ఏఈ జగదీశ్ తెలిపారు.


