చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడం, వాతావరణ మార్పులతో దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తాయి. న్యుమోనియా లక్షణాలను సాధారణ జలుబుగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. జ్వరం, తీవ్రమైన దగ్గు, కఫం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతినొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
– పవిత్ర, జిల్లా వైద్యాధికారి
పరిశుభ్రతతో నివారణ
చలికాలంలో బయటకు వెళ్లేటప్పుడు వెచ్చని దుస్తులు ధరించాలి. చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. చిన్నపిల్లలకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయించాలి. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైద్యుల సూచన మేరకు న్యుమోకాకల్, ఫ్లూ టీకాలు తీసుకోవాలి. సొంత వైద్యం చేసుకోకుండా లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.
– ఆదిశ్‌రెడ్డి, పిల్లల వైద్యనిపుణుడు


