హరీశ్‌రావుపై ఆరోపణలు నిరూపించాలి | - | Sakshi
Sakshi News home page

హరీశ్‌రావుపై ఆరోపణలు నిరూపించాలి

Nov 14 2026 12:17 AM | Updated on Nov 14 2026 12:17 AM

● టీబీజీకేఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసి రామమూర్తి

గోదావరిఖని: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావుపై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని టీబీజీకేఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసి రామమూర్తి సవాల్‌ చేశారు. స్థానిక టీబీజీకేఎస్‌ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన యూనియన్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సింగరేణిని కాపాడుకోవడానికి బీఆర్‌ఎస్‌, టీబీజీకేఎస్‌ చేస్తున్న పోరాటాలను నీరుగార్చడానికి టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తిహార్‌ జైలుకు వెళ్లి వచ్చినప్పటి నుంచి కవిత మతిభ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అందులో భాగంగానే హరీశ్‌రావును వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కోల్‌బెల్ట్‌ ఏరియాలో బీఆర్‌ఎస్‌ ఓడిపోవడానికి కవిత వ్యవహరించిన తీరే కారణమని ఆరోపించారు. నాయకులు నూనె కొమరయ్య, పర్లపల్లి రవి, చెల్పూరి సతీశ్‌, ఇందూరి సత్యనారాయణ, అబ్దుల్‌ గని, దూట శేషగిరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement