సింగరేణి కార్మికుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

సింగరేణి కార్మికుడి ఆత్మహత్య

Nov 14 2026 12:17 AM | Updated on Nov 14 2026 12:17 AM

రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్‌ గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు సల్పాల తిరుపతి(33) శుక్రవారం ఈతచెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి రామగుండం–1 ఏరియా 11వ గనిలో బదిలీ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పట్నుంచి మద్యానికి బానిసై విధులకు గైర్హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది రత్నాపూర్‌ ఎల్లమ్మగుడి వద్దగల ఈత చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement