వైద్యుల నిర్లక్ష్యంతోనే వివాహిత మృతి | - | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యంతోనే వివాహిత మృతి

Nov 14 2026 12:17 AM | Updated on Nov 14 2026 12:17 AM

● ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై భర్త ఫిర్యాదు

పెద్దపల్లి: పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య రుహానా(29) ప్రాణాలు కోల్పోయిందని భర్త ఎస్‌కే అస్లాం ఆరోపించారు. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరగా.. సకాలంలో వైద్యం అందించలేదన్నారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు.. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం రాయికల్‌గడ్డకు చెందిన అస్లాం భార్య రుహానా తొమ్మిది నెలల గర్భిణి. ప్రసవం కోసం నవంబర్‌ 12న పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రసవ సమయంలో తగిన వైద్య పర్యవేక్షణ లేక పరిస్థితి విషమించిందని, రక్తస్రావం ప్రారంభమైనా వైద్యులు సకాలంలో స్పందించలేదని భర్త ఆరోపించాడు. ఆమెను కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి మరింత విషమించడంతో వరంగల్‌ ఎంజీఎం తీసుకెళ్లినట్లు తెలిపాడు. అక్కడ చికిత్స పొందుతూ నవంబర్‌ 13న రుహానా మృతి చెందినట్లు పేర్కొన్నాడు. వైద్యుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని అస్లాం పోలీసులను కోరాడు. విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ వివరణ కోరగా.. హెరిస్క్‌ ప్రెగ్నెన్సీతోపాటు బీపీ, కిడ్నీ సమస్య తీవ్రంగా ఉండడంతో కరీంనగర్‌కు రెఫర్‌ చేశామన్నారు. అక్కడి వైద్యులు ఎంజీఎంకు రెఫర్‌ చేశారని, వైద్యసేవల్లో తాము నిర్లక్ష్యం చేయలేదని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement