గోదావరిఖని: బేస్‌వర్క్‌షాప్‌లో మెయింటనెన్స్ సెక్షన్‌ను యథావిధిగా కొనసాగించాలని టీబీజీకేఎస్ నాయకులు కోరారు. ఓసీపీ–1 మేనేజర్ పాపయ్యను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. మెయింటనెన్స్ సెక్షన్‌ను తొలగించి ఇతర విభాగాల్లో విలీనం చేయడం ద్వారా యంత్రాల నిర్వహణ గాడితప్పిందని తెలిపారు. మోకాళ్లు, నడుము నొప్పి వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్మికులను ఇందులో నియమించారని, సెక్షన్ ఎత్తివేతతో ఇతర విభాగాలకు బదిలీ చేయడంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డంపర్లు, యంత్రాల మరమ్మతు త్వరగా పూర్తయ్యేందుకు అనుభవం గల కార్మికులను తిరిగి అదే సెక్షన్‌లో కొనసాగించాలని కోరారు. టీబీజీకేఎస్ ఆర్జీ–3 ఉపాధ్యక్షుడు నాగెల్లి సాంబయ్య, నాయకులు దేవ శ్రీనివాస్, ఇసంపల్లి రమేశ్, భోగం పూర్ణాకర్, హరికిషన్, పోతరాజు రవి, సైండ్ల సత్యనారాయణ, కేశవరావు, బుద్దె ఉదయ్, బండి బాబురావు, అభిలాష్, కూతాటి వెంకటయ్య, రామకృష్ణ, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
రామగిరి: ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–1 బేస్ వర్క్‌షాప్‌లో మెయింటనెన్స్ సెక్షన్‌ను యథావిధిగా కొనసాగించాలని టీబీజీకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఏరియా ఉపాధ్యక్షుడు నాగెల్లి సాంబయ్య ఆధ్వర్యంలో శుక్రవారం జీఎం మధుసూదన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సెక్షన్ల కుదింపులో భాగంగా మెయింటనెన్స్ విభాగాన్ని తొలగించి, అందులోని కార్మికులను ఇతర విభాగాల్లోకి బదిలీ చేయడంతో భారీ యంత్రాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. మోకాళ్లు, నడుము నొప్పులు తదితర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్మికులను యాజమాన్యం ఈ విభాగంలో నియమించిందని, ఇప్పుడే వేరే విభాగాలకు బదిలీ చేస్తే సమస్యలు మొదటికొస్తాయన్నారు. నాయకులు దేవ శ్రీనివాస్, ఈసంపల్లి రమేశ్, రమ్యరెడ్డి, షరీఫ్ ఉద్దీన్, భోగం పూర్ణాకర్, హరికిషన్, పోతరాజు రవి, సైండ్ల సత్యనారాయణ, కేశవరావు, బుద్దె ఉదయ్, బండి బాబురావు తదితరులు పాల్గొన్నారు.


