సింగరేణి క్రికెట్‌ చాంపియన్‌ ‘శ్రీరాంపూర్‌’ | - | Sakshi
Sakshi News home page

సింగరేణి క్రికెట్‌ చాంపియన్‌ ‘శ్రీరాంపూర్‌’

Nov 14 2026 12:17 AM | Updated on Nov 14 2026 12:17 AM

● మణుగూరు – ఇల్లెందు జట్టుపై ఘన విజయం ● ముగిసిన కంపెనీ స్థాయి పోటీలు

బహుమతులు అందుకుంటున్న విజేత శ్రీరాంపూర్‌, రన్నరప్‌ మణుగూరు – ఇల్లెందు సంయుక్త జట్లు

రామకృష్ణాపూర్‌: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూ ర్‌లోని ఠాగూర్‌ స్టేడియంలో మూడు రోజులుగా ని ర్వహిస్తున్న సింగరేణి కంపెనీ స్థాయి క్రికెట్‌ పోటీ లు శుక్రవారం ముగిసాయి. ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీ రాంపూర్‌ జట్టు మణుగూరు – ఇల్లెందు సంయుక్త జట్టుపై ఘనవిజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. మణుగూరు–ఇల్లెందు జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేతలకు మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ బహుమతులు ప్రదానం చేశారు. జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగులు క్రీడాస్ఫూర్తిని ఉత్పత్తిలోనూ చూపుతూ సంస్థ అభివృద్ధికి పాటుపడాలన్నారు. సింగరేణి యాజమాన్యం క్రీడలకు ప్రోత్సా హం అందిస్తోందని, ఇలాంటి క్రీడా సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలంటే సంస్థ లక్ష్యాలను సమష్టిగా అధిగమించాల్సిన అవసరం ఉందని అన్నారు. సింగరేణి స్థాయిలో సత్తాచాటిన క్రీడాకారులు రానున్న కోలిండియా స్థాయి పోటీల్లోనూ ప్రతిభను చాటి సింగరేణి ప్రతిష్టను ని లపాలని కోరారు. కార్యక్రమంలో సీఎంవోఏఐ ఏరి యా అధ్యక్షుడు రమేశ్‌, డీజీఎం(పర్సనల్‌) అశోక్‌, కేకే గ్రూప్‌ ఏజెంట్‌ ఖాదీర్‌, ఏఐటీయూసీ కేంద్ర కా ర్యదర్శి అక్బర్‌ ఆలీ, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్లు అశోక్‌, నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement