రాజకీయ జోక్యంతోనే సమస్యలు పెండింగ్‌ | - | Sakshi
Sakshi News home page

రాజకీయ జోక్యంతోనే సమస్యలు పెండింగ్‌

Nov 14 2026 12:17 AM | Updated on Nov 14 2026 12:17 AM

● ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య

భూపాలపల్లి అర్బన్‌: రాజకీయ జోక్యంతోనే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ ఆరోపించారు. శుక్రవారం భూపాలపల్లిలోని ఇల్లెందు క్లబ్‌లో నిర్వహించిన యూనియన్‌ కేంద్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ టెండర్లు ఈనెల 17న ఖరారు కానున్న నేపథ్యంలో సంస్థ స్వయంగా పాల్గొని బ్లాక్‌ను దక్కించుకోవాలన్నారు. భూపాలపల్లి ప్రాంతానికి కీలకమైన పీవీ నరసింహారావు ఓపెన్‌కాస్ట్‌ గని ఏర్పాటులో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. రామప్ప సరస్సుకు ముప్పు ఉందనే అభ్యంతరాలు, రాజకీయ, న్యాయపరమైన వివాదాలతో ప్రాజెక్టు నిలిచిపోయిందని ఆరోపించారు. గని సాధన కోసం ములుగు కలెక్టర్‌ను కలిసి నిరభ్యంతర పత్రం కోరామని, త్వరలో మంత్రి సీతక్కను కలిసి ప్రభుత్వ సహకారం కోరుతామని ప్రకటించారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలు సుమారు రూ.59వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లకు చేరాయని, వీటి సాధన కోసం ఈ నెల 17, 18, 19 తేదీల్లో అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కేంద్ర కమిటీ నాయకులు కె.సారయ్య, కె.వీరభద్రయ్య, వైవీ రావు, ఎం.సమ్మయ్య, ఎం.ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement