సౌర విద్యుత్‌ వినియోగించాలి | - | Sakshi
Sakshi News home page

సౌర విద్యుత్‌ వినియోగించాలి

Nov 11 2026 12:07 AM | Updated on Nov 11 2026 12:07 AM

మంథని: సౌర విద్యుత్‌ను వినియోగించుకోవాల ని ట్రాన్స్‌కో ఎస్‌ఈ గంగాధర్‌ సూచించారు. సోలార్‌ విద్యుత్‌ వినియోగం, పీఎం సూర్య ఘర్‌ పథకంపై మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో అవగాహన కల్పించారు. రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థల ఏర్పాటు, ప్రభుత్వ సబ్సిడీలు, బ్యాంకు రుణ సదుపాయాలు, పథకం ప్రయోజనాలపై ప్రజలకు వివరించారు. ఆర్‌ఈడీసీవో జిల్లా మేనేజర్‌ మనోహర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ వోడ్నాల శ్రీనివాస్‌ మాట్లాడారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ముస్కుల సహేందర్‌రెడ్డి, కమిషనర్‌ మనోహర్‌, పాలకవర్గ సభ్యులు కుర్ర లింగయ్య, మారుపాక నిహారిక, పెంటరి రాజు, ఎల్లెంకి వంశీధర్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడుదుల వెంకన్న, విద్యుత్‌ నియంత్రణ సలహా మండలి సభ్యుడు శశిభూషణ్‌ కాచే, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement