ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు

Nov 11 2026 12:07 AM | Updated on Nov 11 2026 12:07 AM

● ప్రతీ పాఠశాల వద్ద స్కూల్‌ జోన్‌ బోర్డు ఏర్పాటు

పెద్దపల్లి: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ అరుణశ్రీతో కలిసి రోడ్డు భద్రత ప్రమాణాల అమలుపై కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్షించారు. పెద్దపల్లిలోని ప్రధాన జంక్షన్ల వద్ద ఆక్రమణలు తొలగించి, ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి చేపట్టాలని సూచించారు. రోడ్డు విస్తరణకు వీధి వ్యాపారులతో సమన్వయం చేసుకోవాలని, డివైడర్లు, యూటర్న్‌లను పరిశీలించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై పశువులను వదిలే సేవారికి రూ.10 వేల జరిమానా విధించడంతోపాటు వాటిని గోశాలలకు తరలించాలని ఆదేశించారు. రామగుండం నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలో గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాలపై సమగ్ర నివేదిక అందించాలని, ప్రతీ పాఠశాల వద్ద స్కూల్‌ జోన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో బాధితులకు పరిహారం అందించేలా ప్రతిపాదనలు పంపాలని అన్నారు. కార్యక్రమంలో డీసీపీ రాంరెడ్డి, ఆర్‌ అండ్‌ బీ ఈఈ భావ్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

నిబందనలు ఉల్లంఘన.. 9 కేసులు నమోదు

జిల్లాలో ఇప్పటివరకు 50 బియ్యం దుకాణాల్లో తనిఖీలు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై 9 కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లావ్యాప్తంగా బియ్యం దుకాణాలు, రైస్‌ మిల్లుల్లో నిల్వలు, ధరల పట్టికలు, తూకాలు, స్టాక్‌ రిజిస్టర్లను అధికారులు తనిఖీ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పేదలకు మెరుగైన వైద్యం

పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా ప్ర భుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. వైద్య సదుపాయాలు, సిబ్బంది విధులపై ఆరా తీశారు. పేషెంట్లు, వారి బంధువులకు నాణ్యమైన ఆహారం అందించడంతోపాటు వార్డులు, మ రుగుదొడ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీధర్‌, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement