వేగంగా పుష్కరాల పనులు | - | Sakshi
Sakshi News home page

వేగంగా పుష్కరాల పనులు

Nov 11 2026 12:07 AM | Updated on Nov 11 2026 12:07 AM

మంథని: గోదావరి పుష్కరాల సందర్భంగా చే పట్టిన రోడ్డు నిర్మాణం, విస్తరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పట్టణంలో కలెక్టర్‌ మంగళవారం ప ర్యటించారు. మంథని–గోదావరిఖని ప్రధాన రహదారి, పుష్కర ఘాట్‌ సమీపంలోని రోడ్డు, మహాలక్ష్మీ ఆలయ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న విద్యుత్‌ స్తంభాల తరలింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలనిన్నారు. రోడ్డు పనులకు ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని సూ చించారు. మున్సిపల్‌ చైర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ ముస్కుల సహేందర్‌రెడ్డి, ట్రాన్స్‌కో శాఖ ఎస్‌ఈ గంగాధర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

పరిశ్రమల భద్రత లక్ష్యం

జ్యోతినగర్‌: కీలక పారిశ్రామిక సంస్థలు, వ్యూ హాత్మక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలకు ప టిష్ట భద్రత కల్పించాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా ఆదేశించారు. ఎ న్టీపీసీ పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చే శారు. ఏసీపీ రమేశ్‌, ఎస్సై వెంకటస్వామి మొ క్క అందజేసి స్వాగతం పలికారు. 5 ఎస్‌ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, రికార్డులను క్రమపద్ధతిలో నిర్వహించాలని సూచించారు. పాత నేరస్థులు, రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని చెప్పారు. నేరాలు, పెండింగ్‌ కేసులు, దర్యాప్తు పురోగతి, విజిబుల్‌ పోలీసింగ్‌, పెట్రోలింగ్‌ తదితర అంశాలను సమీక్షించారు.

దళారులను నమ్మొద్దు

సుల్తానాబాద్‌రూరల్‌: పత్తి కొనుగోలు కేంద్రాల ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌రెడ్డి కోరారు. చి న్నకల్వల పరిధిలోని శ్రీశ్రీనివాస్‌ జన్నింగ్‌ మి ల్లులో సుల్తానాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌, కా టన్‌ కార్పొరేషన్‌ ఆఽఫ్‌ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించి మ ద్దతు ధర పొందాలని సూచించారు. ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి మనోహర్‌, సీసీఐ అధికారి రత్నాకర్‌, యాజమాని శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.

ఉపాధి వివరాల సేకరణ

కోల్‌సిటీ: జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) రామగుండంలో పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే నిర్వహిస్తున్నట్లు గణాంక శాఖ అధికారి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మంగళవా రం నగరంలోని కార్మికుల పరిస్థితి, స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తదితర వివరాలను సేకరించామన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అరుణశ్రీని కలిసి సర్వే పత్రాలు అందజేశారు. కార్పొరేటర్‌ నేలకంటి రాము, వార్డు అధికారి సాయికృష్ణ, మెప్మా ఆర్పీలు ఆ వునూరి స్వరూప, సూర్యకుమారి పాల్గొన్నారు.

క్వింటాల్‌ పత్తి రూ.8,672

పెద్దపల్లిరూరల్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.8,672గా ధర ఉందని, కనిష్టంగా రూ.8,221గా, సగటు రూ.,8525గా ధర ఉందని మార్కెటింగ్‌ శాఖ అధికారి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం 410 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

ప్రకృతి సేద్యం పరిశీలన

రామగిరి: దేశీయ వరి వంగడాల పరిరక్షణ, ప్ర కృతి సేద్య విధానంలో వరి రకాలు సాగు చేస్తు న్న కల్వచర్ల రైతు యాదగిరి శ్రీనివాస్‌ కృషి అభినందనీయమని భారతీయ వరి పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు కొనియాడారు. కల్వచర్లలో సాగు చేస్తున్న దేశవాలీ వరి విత్తన క్షే త్రాన్ని శాస్త్రవేత్తలు మంగళవారం పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement