● కలెక్టర్‌ ఆదేశాలతో ప్రయోగాత్మకంగా ఫ్రీ లెఫ్ట్‌ అమలు ● ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికే అంటున్న పోలీసులు | - | Sakshi
Sakshi News home page

● కలెక్టర్‌ ఆదేశాలతో ప్రయోగాత్మకంగా ఫ్రీ లెఫ్ట్‌ అమలు ● ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికే అంటున్న పోలీసులు

Nov 11 2026 12:07 AM | Updated on Nov 11 2026 12:07 AM

● కలెక్టర్‌ ఆదేశాలతో ప్రయోగాత్మకంగా ఫ్రీ లెఫ్ట్‌ అమలు ● ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికే అంటున్న పోలీసులు

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రంలోని కమాన్‌ వద్ద వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కమాన్‌ – చీకురాయి రోడ్డ వైపు వెళ్లే వాహనదారులను నియంత్రించి, వారిని ఫ్రీలెఫ్ట్‌ పద్ధతిని పాటిస్తూ కూనారం క్రాస్‌రోడ్డు నుంచి రావాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తూ.. కమాన్‌ వద్ద రోడ్డు మార్గాన్ని బారికేడ్లతో మూసేశారు. ఈ విషయం తెలియని వాహనదారులు కమాన్‌వద్ద ట్రాఫిక్‌ పోలీసులను ఎందుకు అలా మళ్లిస్తున్నారంటూ ప్రశ్నించారు. కమాన్‌ ప్రాంతంలో వాహన రద్దీని నియంత్రించేలా ట్రయల్‌గా ఫ్రీ లెఫ్ట్‌ పద్ధతి పాటించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఇచ్చిన ఆదేశాలతో ఇలా చేస్తున్నామని ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొంటున్నారు.

తప్పని తికమక..

జెండా ప్రాంతం, పోలీస్‌స్టేషన్‌, మున్సిపల్‌ ఆఫీసు, సాగర్‌రోడ్డు ప్రాంతాలకు పనుల నిమిత్తం వెళ్లొచ్చే వారంతా చీకురాయిరోడ్డు, రంగంపల్లి, కలెక్టరేట్‌ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు కమాన్‌ వద్ద మలుపు తిరిగేవారు. ఎప్పటిలాగే రావడంతో ట్రాఫిక్‌ పోలీసులు ఆ మార్గాన్ని మూసేయడంతో ఎటు వైపు వెళ్లాలో తెలియక తికమక పడ్డారు. వారంతా అక్కడిదాకా వెళ్లి వెనక్కి వచ్చి కూనారం క్రాస్‌రోడ్డు నుంచి మలుపు తీసుకోగా.. ఇంకొందరు పాదచారుల కోసం ఖాళీగా ఉన్న స్థలంలో నుంచే తమ ద్విచక్రవాహనాలను తిప్పుకోవడం రాకపోకలు సాగించేవారిని ఇబ్బందులకు గురిచేసింది. కమాన్‌ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఫ్రీలెఫ్ట్‌ విధానాన్ని ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాస్‌ తదితరులు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement