పెద్దపల్లిరూరల్: పల్లె ప్రజలకు మిషన్‌భగీరథ ద్వారా తాగునీరు సక్రమంగా సరఫరా అవుతోందా? ఏమైనా ఇబ్బందులున్నాయా? అని ఎంపీడీవో శ్రీనివాస్ ఆరా తీశారు. బ్రాహ్మణపల్లి రైతువేదికలో మిషన్‌భగీరథ ఇంట్రా డీఈఈ సతీశ్, గ్రిడ్ అనిల్‌కుమార్, ఏఈలు అభిలాష్, రాముతోపాటు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం సమావేశమయ్యారు. ఎల్‌నినో ప్రభావంతో తాగునీరు సరఫరాకు అంతరాయం కలిగే అవకాశమున్నందున నీటిని పొదుపుగా వాడుకునేలా ప్రజల్ని చైతన్యపర్చాలని సూచించారు. అలాగే బీవీజీరాంజీ ద్వారా రోజూ కనీసం 60మంది కూలీలకు పనులు కల్పించాలని ఏపీవో రమేశ్‌బాబుకు సూచించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.


