ఫుట్‌బాల్‌ విజేత జట్టుకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌ విజేత జట్టుకు సన్మానం

Nov 7 2026 12:06 AM | Updated on Nov 7 2026 12:06 AM

గోదావరిఖని: సింగరేణి స్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో విజేతగా నిలిచిన ఆర్జీ–1,2 జట్టును లేడీస్‌ క్లబ్‌, ఆర్‌సీవోఏ క్లబ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. స్థానిక జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించిన కంపెనీ స్థాయి ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో సింగరేణి పరిధిలోని 11ఏరియాల జట్లు హోరాహోరీగా తలపడగా ఫైనల్‌ మ్యాచ్‌లో ఆర్జీ–1,2 జట్టు విజయం సాధించింది. జట్టు కెప్టెన్‌ సామల సత్యనారాయణ ఆధ్వర్యంలో విజయం సాధించిన సభ్యులను అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు అనిత, ఆర్‌సీవోఏ క్లబ్‌ కార్యదర్శి కేడీఎన్‌ వరప్రసాద్‌, క్వాలిటీ జీఎం వెంకటరమణ, స్పోర్ట్స్‌ గౌరవ కార్యదర్శి హనుమంతరావు, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్‌ నరేందర్‌రెడ్డి, లేడీస్‌ క్లబ్‌ కార్యదర్శి శిరీష, సేవా కార్యదర్శి బీనాసింగ్‌, జాయింట్‌ సెక్రటరీ రజిత, క్లబ్‌ సభ్యులు మణి, భాస్కరి, విజయ, చిలుక లక్ష్మి, కల్యాణి, సుధా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement