మంథని: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ద్వితీయశ్రేణ న్యాయమూర్తి బి,అనురాధ అన్నారు. మంథని ప్రభుత్వ బా లికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. వి ద్యార్థి దశలోనే చట్టాలు, బాలల హక్కులు తె లుసుకోవాలని, న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా అవగాహన కలిస్తున్నామని తెలిపారు. మంథని బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కె.రఘోత్తంరెడ్డి, న్యాయవాది శశిభూషణ్‌కాచే, ఇన్‌చార్జీ ప్రిన్సిపాల్ ఝాన్సీ, అధ్యాపకుడు రావుల తిరుమల్ పాల్గొన్నారు.
ట్రాన్స్‌జెండర్లకు రక్షణ
పెద్దపల్లిరూరల్: ట్రాన్స్‌జెండర్ల రక్షణ కోసం ప్రభు త్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి వారి హక్కు ల పరిరక్షణ, భద్రత కోసం పనిచేస్తోందని మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ రమేశ్‌బాబు అన్నారు. స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ట్రాన్స్‌జెండర్‌ల హక్కు లు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. కేంద్ర హోంశాఖ ట్రాన్స్‌జెండర్ల కోసం ప్ర త్యేక మార్గదర్శకాలను రూపొందించిందని పేర్కొన్నారు. వారిభద్రత కోసం మహిళా భద్రతా విభాగం (వుమెన్ సేఫ్టీ వింగ్) ద్వారా రక్షణ చర్యలకోసం ప్రత్యేక విభాగం పనిచేస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో షీటీం ఇన్‌చార్జి ఎస్సై లావణ్య, మహిళా స్టేషన్ ఎస్సై రవళి, సభ్యులు, భరోసా కో ఆర్డినేటర్ అశ్రిత, సిబ్బంది పాల్గొన్నారు.
ఇద్దరి నేత్రాలతో నలుగురి జీవితాల్లో వెలుగులు!
● మరణంలోనూ మానవత్వాన్ని చాటిన రెండు కుటుంబాలు
కోల్‌సిటీ: ఆప్తులను కోల్పోయిన పుట్టెడు దుః ఖంలోనూ రెండు కుటుంబాలు గొప్పమనసు చాటుకున్నాయి. తమవారి కళ్లతో మరో ఇ ద్దరు ఈ లోకాన్ని చూడాలనే మానవీయ ఆ లోచనతో నేత్రదానానికి ముందుకొచ్చాయి. గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన వాలా లక్ష్మి (82) అనారోగ్యంతో, అదేకాలనీకి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు మిడిదొడ్డి రాములు (81) శుక్రవారం మృతి చెందారు. ఇద్దరి కుటుంబాలకు నేత్రదానాలపై సదాశయ ఫౌండేషన్ ప్రతినిధి, రామగుండం మగువ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షురాలు అట్లూరి శశికళ అవగాహన కల్పించారు. దీంతో రెండు కుటుంబాలు నేత్రదానం చేయడానికి అంగీకారం తెలిపారు. ఫౌండేషన్ ప్రతినిధులు ఆరపెల్లి రాజమౌళి, కేఎస్ వాసు, శశికళ ఆధ్వర్యంలో వాసన్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ చందు సహకారంతో సేకరించిన నేత్రాలను హైదరాబాద్‌కు తరలించారు.
దరఖాస్తులు ఆహ్వానం
కరీంనగర్‌టౌన్: దివ్యాంగుల సాధికారతకు కృషి చేసిన ఉత్తమ వ్యక్తులు, సంస్థలకు రాష్ట్రస్థాయి పురస్కారాలు డిసెంబర్ 3న అందజేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. క రీంనగర్ జిల్లాకు చెందిన అర్హులైన వారు మా ర్గదర్శకాలు, దరఖాస్తు నమూనాను అధి కారిక వెబ్‌సైట్ https:// depwdsctgp. telangana. gov. in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను తగిన ధ్రువీకరణ పత్రాలతో నవంబర్ 16 లోగా కరీంనగర్ నూతన కలెక్టరేట్‌లోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో అందజేయాలని సంక్షేమ అధికారి సరస్వతి తెలిపారు.


