ధర్మారం: నందిమేడారం బాలుర గురుకుల విద్యాలయంలో ర్యాగింగ్ కలకలం రేపింది. పదో తరగతి విద్యార్థిపై అదే తరగతికి చెందిన నలుగురు విద్యార్థులు దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి స్టడీ అవర్ ముగి శాక విద్యార్థులందరు నిద్రించేందుకు వెళ్లారు. ఈక్రమంలో పదో తరగతి విద్యార్థి పడుకునేందుకు బ్లాంకెట్ కోసం గది వద్దకు వెళ్తుండగా అక్కడకు వచ్చిన తోటి నలుగురు విద్యార్థులు నెక్కరు, షర్టు కిందకు లాగారు. ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించటంతోపాటు దుషించాడు. తమ నే దూషిస్తావా అంటూ ఆ నలుగురు టెన్త్ విద్యార్థి వీపు, ముఖంపై పిడుగుద్దులు కురిపించారు. ఈ విషయం ఎవరికై నా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. భయపడిన బాధితుడు ఎవరికీ చెప్పలేదు. శుక్రవారం ఉదయం తోటి విద్యార్థులతో స్నానానికి వెళ్లగా వీపుపై ఎర్రగా, కమిలిపోయిన గాయాలు కనిపించాయి. దీనిపై పీఈటీ రాజశేఖర్ ఆరా తీయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే ప్రిన్సిపాల్ విద్యాసాగర్ దృష్టికి తీసుకెళ్లారు. నిందితులోతపాటు బాధితుడిని పిలిపించి ఆరా తీశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌చేసి విద్యాలయానికి రావాలని ఆదేశించారు. గాయపడిన విద్యార్థిని సిక్‌రూంకు పంపించి ప్రథమ చికిత్స చేయించారు. గాయపడిన విద్యార్థి అనాథ కావడంతో బాగోగులు చూసుకునే బాబాయి బాలసాని కుమారస్వామి, పిన్ని పుష్పలత గోదావరిఖని నుంచి మధ్యాహ్నం 2 గంటలకు విద్యాలయానికి చేరుకున్నారు. ప్రిన్సిపాల్‌తో మాట్లాడిన అనంతరం నిందితులను ప్రశ్నించారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న ఎస్సై ఎంబడి శ్రీకాంత్ విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలోనే నలుగురు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. గాయపడిన విద్యార్థి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.కాగా, గురుకులంలో గతంలోనూ ఇలాంటి ఒకట్రెండు ఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. తాజాగా అనాథ బాలుడిపై దాడి వెలుగులోకి రావడంతో ర్యాగింగ్, వేధింపులను ఎలా అరికడతారనే ఆందోళన వ్యక్తమవుతోంది.


