మట్టికళకు ఆదరణ కరువు | - | Sakshi
Sakshi News home page

మట్టికళకు ఆదరణ కరువు

Nov 7 2026 12:06 AM | Updated on Nov 7 2026 12:06 AM

శుభ, అశుభకార్యాల్లో కుమ్మరులకే ప్రాధాన్యత

మారిన పరిస్థితులు.. మసకబారుతున్న కులవృత్తి

సంప్రదాయాలకు స్వస్తి.. ప్లాస్టిక్‌ వాడకానికే మొగ్గు

మంథనిరూరల్‌: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగడం.. పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడడం సంప్రదాయ కులవృత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పూర్వం నుంచి మట్టి వస్తువుల వినియోగంలో ముఖ్యపాత్ర పోషించిన కుమ్మర వృత్తి, మట్టి పాత్రలకు ఆదరణ తగ్గుతోంది. మట్టిని శిల్పంగా తీర్చిదిద్దే కుమ్మరి నిత్యం ప్రజావసరాల కోసం వినియోగించుకునే వస్తువులను తయారు చేసేవారు. క్రమంగా మారుతున్న కాలం, పరిస్థితులతో కుమ్మరి మట్టి వస్తువులను మరిచి ప్లాస్టిక్‌ వినిగించడం పెరిగిపోతోంది.

శుభ, అశుభ కార్యాల్లో..

ప్రతీ కుటుంబంలో జరిగే శుభ, అశుభ కార్యాల్లో కుమ్మరులకు ప్రాధాన్యత ఉంటుంది. పెళ్లి జరిగినా, మరణం సంభవించినా కుమ్మరులు తయారుచేసిన వస్తువులే అవసరం ఉంటాయి. ఇవేకాకుండా ప్రతీపండుగకు కుమ్మరులు చేసిన వస్తువుల వాడకం సంప్రదాయంగా భావిస్తారు. ఇక దీపావళి, శివరాత్రి, ఉగాదిలాంటి పండుగకు ప్రత్యేకంగా వస్తువులు తయారు చేయడం ఆనవాయితీ.

ప్లాస్టిక్‌.. డిజైన్‌ల ప్రభావం...

పాశ్చాత్య నాగరికతతో వృత్తులు కనుమరుగవుతున్నాయి. పాస్టిక్‌ వినియోగం, సరికొత్త డిజైన్‌ల వైపు మొగ్గు చూపడం, ఆధునిక జీవనశైలికి అవవాటుపడటంతో సంప్రదాయ వస్తువులకు ప్రాధాన్యత తగ్గుతోంది. దీంతో కుమ్మరులు సహజసిద్ధంగా తయారు చేసే వస్తువులకు డిమాండ్‌ తగ్గిపోయి వారిజీవనంపై ప్రభావం చూపుతోంది.

పనికి తగ్గ ఆదాయం లేక..

ఒకప్పుడు ఎంతపనిచేస్తే అంతఆదాయం వచ్చేదని కుమ్మరులు చెబుతున్నారు. ప్రతీఇంటిలో పనిచేసే వారు ఉండేవారని, మట్టి వస్తువుల వినియోగం ఉండేదని చెబుతున్నారు. రానురానూ పనికి తగిన ఆదాయం లేక ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొద్దంతా కుటుంబం కష్టపడితే కనీస కూలి గిట్టుబాటు కావడం లేదంటున్నారు, దీపావళి లాంటి పండుగలకు ఇంటిల్లిపాది కష్టపడి దీపాలు, చెమ్మలు, కుండలు, గిన్నెలు తయారు చేస్తే ప్లాస్టిక్‌ వస్తువులే ఎక్కువగా కొంటారని, తమకు గిరాకీ ఉండదని వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement