గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలోని జీడీకే–5 ఓసీపీని రామగుండం రీజియన్ సేఫ్టీ జీఎం మల్లయ్య గురువారం సందర్శించారు. ఓసీపీలో యంత్రాల పనితీరు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గనుల్లో రక్షణ చర్యలు తదితర అంశాలపై పరిశీలించారు. ఈసందర్భంగా రక్షణచర్యల ప్రాముఖ్యతను వివరించారు. సేఫ్టీ జీఎం వెంట గని మేనేజర్ అనిల్‌గబాలే, సేఫ్టీ ఆఫీసర్ గంధం రాములు, ఆఫ్ లోడింగ్ ఇన్‌చార్జి ఎ.రవికుమార్ ఉన్నారు.
పింఛన్‌దారులకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ శిబిరం
రామగిరి: సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఆర్జీ–3. ఏపీఏ ఏరియా పర్సనల్ విభాగాధిపతి ఎండీ ఆసిఫ్ సూచించారు. ఈనెల 9, 10వ తేదీల్లో శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారికోసం జీఎం కార్యాలయం ఎదుట ఉన్న సెక్యూరిటీ కార్యాలయంలో క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, పీపీవో నంబర్ కాపీ, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను వెంట తీసుకురావాలని సూచించారు.
కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి
గోదావరిఖని: సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వేల్పుల కుమారస్వామి డిమాండ్ చేశారు. గురువారం ఆర్జీవన్ ఏరియాలో కాంట్రాక్టు కార్మికుల అడ్డాల వద్ద పోస్టర్ విడుదల చేశారు. ఈనెల10న హైదరాబాద్‌లోని సెంట్రల్ లేబర్ ఆఫీస్ వద్ద నిర్వహించే ధర్నాకు కాంట్రాక్టు కార్మికులు తరలిరావాలని కోరారు. కనీస వేతనం రూ.42వేలు నిర్ణయించాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజు, చారి, రాజేందర్, వినయ్, దుర్గ, రాజేశ్వరి, కుమారి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


