ఉమ్మడి జిల్లాలో వరిసాగు వివరాలు (ఎకరాల్లో) | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాలో వరిసాగు వివరాలు (ఎకరాల్లో)

Oct 28 2026 12:12 AM | Updated on Oct 28 2026 12:12 AM

ఉమ్మడి జిల్లాలో వరిసాగు వివరాలు (ఎకరాల్లో) ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఇలా(టీఎంసీల్లో) రాసిస్తేనే వరి..! అదంతా అవాస్తవం

డిక్లరేషన్‌ సమర్పిస్తేనే వరి విత్తనాలు అంటూ ప్రచారం

ఎల్‌నినో దెబ్బకు వరి వేయకుండా ప్రభుత్వం ఎన్‌వోసీ

పలు వ్యవసాయ అధికారుల గ్రూపుల్లో వైరల్‌

త్వరలో విత్తన డీలర్లకు అందనున్న ఫారం?

ధ్రువీకరించేందుకు ముందుకు రాని వ్యవసాయాధికారులు

2,64,612

3,05,000

2,15,100

2,75,421

2,15,000

2,93,825

20.17

2,10,380

2,40,088

24

17.6

15.2

ఎల్లంపల్లి

దిగువ మానేరు

పెద్దపల్లి

కరీంనగర్‌

రాజన్న సిరిసిల్ల

జగిత్యాల

మధ్యమానేరు

రాష్ట్రంలో అత్యధికంగా వరిసాగు చేసే జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్‌ మొదటిస్థానంలో ఉంటుంది. అలాంటి వరిసాగుకు వచ్చే సీజన్‌లో బ్రేక్‌ పడనుంది. ఎల్‌నినో నేపథ్యంలో సాగునీటి కొరతతో ఇకపై రైతులు వరి పండించాలంటే నష్టానికి తమదే బాధ్యత అని విత్తనాలు విక్రయించే డీలర్లకు డిక్లరేషన్‌ ఇవ్వాలంటూ జరుగుతున్న సోషల్‌ మీడియా ప్రచారం చర్చనీయాంశమైంది.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

వరిసాగుకు మిగిలిన పంటల కన్నా అధికంగా నీరు అవసరం. ఎల్‌నినో ప్రభావంతో వానాకాలానికి ముందే వ్యవసాయాధికారులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలైన కూరగాయలు, ఇతర స్వల్పకాలిక పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎంత అవగాహన కల్పించినా రైతులు వరికే మొగ్గు చూపారు. కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో గతేడాది సాగు విస్తీర్ణంలో దాదాపు 90శాతం పైగా వరినే సాగు చేశారు. ఉమ్మడి జిల్లాల్లో ఎస్సారెస్పీ వరద కాలువ, ఎగువ, మధ్య, దిగువ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ.. అందులోని నీరు తాగేందుకు మాత్రమేనని, సాగునీరు ఇచ్చే పరిస్థితులు లేవని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

వ్యవసాయాధికారుల గ్రూపుల్లోనే..

ఈ సమయంలో ఓ డిక్లరేషన్‌ ఫారం రైతుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. డీలర్ల వద్ద ఈ ఫారం నింపి ఇస్తేనే విత్తనాలు అందుతాయని సమాచారం. అందులో ఏముందంటే..? ఎల్‌నినో కారణంగా వరి సాగు చేయవద్దని ప్రభుత్వం చెబుతోంది. కరెంటు, సాగునీటి కొరతతో వరిసాగులో నష్టం వాటిల్లితే ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు.. ఒకవేళ నష్టం వాటిల్లితే తాను ఎలాంటి నష్టపరిహారం ఆశించను. తన ఇష్టపూర్వకంగానే వరిని సాగుచేస్తున్నాం.. అంటూ రైతు తన చిరునామా, ఆధార్‌, ఫోన్‌నంబర్ల వివరాలతో కూడిన ఫారం వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఈ ఫారం.. ఉమ్మడి జిల్లా వ్యవసాయాధికారుల గ్రూపులో షేర్‌ అవుతోంది. ఈ ప్రచారం కేవలం వ్యవసాధికారుల గ్రూపులకే పరిమితం కాలేదు. పలు గ్రామాల వాట్సప్‌ గ్రూపుల్లో, ఇతర సోషల్‌ మీడియా వేదికలపైన చక్కర్లు కొడుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. జిల్లా వ్యవసాయ ఉన్నతాధికారులు త్వరలోనే ఈ ఫారాలు త్వరలోనే విత్తనాల డీలర్లకు చేరతాయి అని కిందిస్థాయి సిబ్బందికి చెబుతున్నారు. అయితే, ఈ ప్రచారాన్ని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు మాత్రం ఖండిస్తున్నారు.

సెల్ఫ్‌ డిక్లరేషన్‌ అంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు. కాలువల ద్వారా నీరిచ్చే అవకాశం లేనందున ఆరుతడి పంటలు వేయాలని చెబుతున్నాం. వేరుశనగ, పెసర తదితర విత్తనాలను సబ్సిడీపై అందజేస్తున్నాం. బోర్లు, బావుల్లో నీరున్నవారు ఆలోచించి పంటలు సాగు చేయాలి. – ఛత్రునాయక్‌,

కరీంనగర్‌ జిల్లా వ్యవసాయ అధికారి

27.55

23.2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement