నైపుణ్య శిక్షణ.. ఉద్యోగ భరోసా | - | Sakshi
Sakshi News home page

నైపుణ్య శిక్షణ.. ఉద్యోగ భరోసా

Oct 28 2026 12:12 AM | Updated on Oct 28 2026 12:12 AM

గోదావరిఖని: నైపుణ్యమే పెట్టుబడిగా.. ఉపాధే లక్ష్యంగా.. యువత భవిష్యత్తుకు భరోసాగా సింగరేణి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ముందుకు సాగుతోంది. ఉన్నత చదువులు పూర్తయినా నైపుణ్యాలు లేక యువత ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోలేకపోతోంది. ఇలాంటి వారికి సింగరేణి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ అండగా నిలుస్తోంది. శిక్షణకే పరిమితం కాకుండా, వృత్తి నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా యువత భవిష్యత్‌ను తీర్చిదిద్దుతోంది. రెండేళ్ల క్రితం గోదావరిఖనిలోని తిలక్‌నగర్‌ ప్రాంతంలో ప్రారంభమైన ఈ కేంద్రం ద్వారా కోల్‌బెల్ట్‌ విస్తరించిన ఆరుజిల్లాల నుంచి 600 మందికిపైగా యువత ఉపాధి అవకాశాలు సాధించడం విశేషం.

నైపుణ్యమే విజయానికి మార్గం

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్హతలతోపాటు వృత్తిపరమైన నైపుణ్యాలు కూడా కీలకంగా మారా యి. పరిశ్రమలు, ప్రైవేటు సంస్థలు, కర్మాగారాలు తమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు అర్హులుగా తీర్చిదిద్దుతోంది స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌.

600 మందికి పైగా ఉపాధి

సింగరేణి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా ఇప్పటివరకు 600 మందికిపైగా యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందింది. వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా అందిస్తోంది. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగితే కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతోపాటు ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఊతం లభిస్తుంది.

సింగరేణి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా ఉద్యోగాలు

600 మందికిపైగా యువతకు ఉజ్వల భవిష్యత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement